సంచలనాల రాంగోపాల్ వర్మ సృష్టించిన `డెన్` పై ఇప్పుడు నెట్టించ చర్చ ఆసక్తికరం. అందమైన హీరోయిన్ల ఫోటోలు.. బికినీ స్టిల్స్..వర్మ శైలి కొటేషన్లు.. ఇంటిరీయర్ డిజైన్ ప్రతీది వర్మ టేస్ట్ కి అనుగుణం గా ఉంది.
ఏది చేసినా క్రియేటివ్ గా ఉండాలని ఆలోచించే వర్మ ఈ ఆఫీస్ విషయంలో కూడా అంతే ప్రెస్టిజీయస్ గా తీసుకుని నిర్మించాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఆ కోటేషన్లు..ఫోటోలు వెనుక కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వర్మని నిత్యం ఫాలో అయ్యే వాళ్లు కొంత మంది డెన్ ని తమదైన శైలిలో ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేసారు. కానీ సృష్టికర్తకి తెలిసిన వాస్తవాలు ఫాలోవర్స్ కి తెలియవు గా.
అందుకే అంతగా కష్టపడిపోకండి అంటూ తాజాగా మరో వీడియో రిలీజ్ చేసాడు. డెన్ లో ఉండే వాటి గురించి తాజా వీడియలో వివరించాడు. ఇందులో ఓ వ్యక్తి వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. వాయిస్ వేరే వాళ్లది అయినప్పటికీ ఆ మాటల సృష్టి కర్త కూడా వర్మ అని క్లియర్ గా అర్దమవుతుంది. ఇందులో పూర్తిగా వర్మ భావజాలం కనిపిస్తుంది.
ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? అతని వ్యక్తిత్వం ఎలాంటింది? అతని టేస్ట్ ప్రతీది వర్మ మార్క్ లో హైలైట్ అవుతుంది. ఈ మొత్తం ఎనాలసిస్ కి `బోల్డ్ ఎనాలసిస్` అనే ఓ పేరు కూడా పెట్టాడు. ఇదే ఆ ఫీస్ లో ఓ చిన్న స్టూడియో కూడా పెట్టాడు.
`నిజం` పేరిట యూట్యూబ్ చానెల్ లో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి షూటింగ్స్..ఎడిటింగ్స్.. మిక్సీఇంగ్ అన్ని డెన్ లో సర్వం సిద్దమయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఓ మినీ థియేటర్ ని కూడా లోపల ఏర్పాటు చేసుకున్నాడు.
మొత్తానికి ఆర్జీవీ ఓ చిన్న స్టూడియో కమ్ ఆఫీస్ లాంటింది నిర్మించాడు అని చెప్పొచ్చు. ఇంతకాలం వర్మకి సొంత ఆఫీస్ అంటూ ఏది లేదు. ఏ సినిమా చేసినా ఆ సినిమా ఆఫీస్ లోనే అన్ని రకాల ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఇకపై ఆ బాధ ఉండదు. వర్మతో ఎలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ అయినా డెన్ లోకి చేసుకోవచ్చు. మీడియా కోసం ఆయన డెన్ గేట్లు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.
Full View