ఆర్జీవి ఈ జన్మకి మారడంతే..!

Update: 2022-12-17 16:50 GMT
సినిమా ప్రమోషన్ కోసం ఎంతకైనా దిగజారే ఆర్జీవి తను తీసే సినిమాలో క్వాలిటీ కన్నా ఎలాంటి సినిమాను తీసినా సరే దాన్ని ఆడియన్స్ చూసేలా ప్రమోషన్స్ మాత్రం చేస్తుంటాడు. రీసెంట్ గా డేంజరస్ సినిమా కోసం ఆర్జీవి అషు రెడ్డితో చేసిన ఇంటర్వ్యూ గురించి నానా రచ్చ జరుగుతుంది. అక్కడ ఉన్నది ఒకప్పటి ఆర్జీవి కాదని అందరు తిట్టిపోస్తున్నారు. ఇక ఈ ఇష్యూపై ఆర్జీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పందించారు.

డేంజరస్ ఇంటర్వ్యూస్ పై ఆర్జీవి మదర్ సూర్యవతి కూడా వెరైటీగా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రాము ఇంటికి రాగానే తాను కచ్చితంగా కనిపించాలి లేకపోతే అతనికి నచ్చదని అన్నారు సూర్యవతి. తనని చూడగానే అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుందని.. అది తనకు బాగా నచ్చుతుందని అన్నారు సూర్యవతి.

తను తీసిన సినిమా జి.ఎస్.టి సినిమా తన పక్కనే కూర్చుని చూశానని షాక్ ఇచ్చారు సూర్యవతి. తనకు మారాలి అనిపించినప్పుడే మారుతాడు తప్ప ఎవరు చెప్పినా వినరు.. ఈ జన్మకు అతను మారడని చెప్పారు సూర్యవతి.

ప్రస్తుతం ఆర్జీవి గురించి ఆయన మదర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్జీవి లాంటి కొడుకుని కన్నందుకు అతని ఫ్యాన్స్ ఆమెకు సలాం అనేస్తుంటే.. ఈ ప్రపంచంలో స్వేచ్చ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఆర్జీవి అని కొందరు అంటున్నారు. అతను తీసిన సినిమా ఎలాంటిదైనా సరే కేవలం తన టీజర్, ట్రైలర్ లతో పాటుగా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. డేంజరస్ సినిమా కన్నా ఆర్జీవి చేసిన ఈ ప్రమోషనల్ రచ్చ మాత్రం సోషల్ మీడియాలో హ్యూజ్ అటెన్షన్ ని తీసుకొచ్చింది.

ఇక తన సినిమాల ఫలితాల పట్ల కూడా ఆర్జీవి అసలు చింతించడు. రిలీజైన నెక్స్ట్ మినిట్ నుంచి తన తర్వాత సినిమా గురించి ఆలోచిస్తాడు తప్ప సినిమా గురించి పట్టించుకోడు. ఎంతో గొప్ప టెక్నికల్ టాలెంట్ ఉన్న ఆర్జీవి అమ్మాయిల థైస్ మీద దృష్టి పెడుతున్నాడు. సూర్యవతి గారు చెప్పినట్టు ఈ జన్మకి ఆర్జీవి మారడం కష్టమే అంటున్నారు నెటిజన్లు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News