కులాలతో ఆడుకుంటున్న వర్మ

Update: 2019-05-31 07:59 GMT
కాంట్రవర్సీనే కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంచి హుషారు మీద ఉన్నట్లున్నాడు.. గతంలో విజయవాడలో కుల ఘర్షణల నేపథ్యంలో బెజవాడ రౌడీలంటూ కులకలం రేపిన వర్మ.. ఇక తన పంథా కొనసాగిస్తూనే ఉన్నాడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నేపథ్యంలో టిడీపీ నేతలు వర్మకు మధ్య మాటల యుద్ధం కొనసాగింది.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఫలితాల ముందు బ్రేక్ పడింది.. ఇదిలా ఉంటే ఫలితాల్లో జగన్ నేతృత్వంలోనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది లేదో వర్మ మరో కాంట్రవర్సీ టైటిల్ తో ముందుకొచ్చారు..
            
త్వరలోనే కమ్మరాజ్యంలో కడప రెడ్లంటూ సినిమా తీయబోతున్నానని మరో సంచలనానికి నాంది పలికారు.. మళ్లీ కుల కోణాలనే స్పృశిస్తూ డైరెక్టుగా వాటి ప్రస్తావన తోనే కమ్మరాజ్యంలో కడపరెడ్లంటూ ఓపెన్ టైటిల్ ను ప్రకటించేశారు.. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.. కొందరు వర్మ కొత్త సినిమా టైటిల్ ను స్వాగతిస్తే.. కమ్మ రాజ్యం అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ కులానికి రాజ్యంగా సంభోదించడంపై మిగతా సామాజికవర్గాల నుంచి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.. చంద్రబాబు హయాంలో తన కులానికి పెద్ద పీట వేశారు వాస్తవమే.. కానీ విభిన్న వర్గాల సమాహారం ఏపీని కమ్మరాజ్యంగా ఎందుకు సంబోధిస్తారంటూ నెటిజన్లు తమ నోటికి పనిచెప్పారు.. మరికొందరైతే సూపర్ టైటిల్ అన్నా.. బాబును మరో సారి ఉతికి ఆరేయ్... లోకేష్ ను వదలొద్దంటూ సోషల్ మీడియా లో స్పందించారు..

ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో మరో సారి కుల కలం రేపారు రామ్ గోపాల్ వర్మ.. ఎండలకు భయపడి కాదు.. రెడ్లకు భయపడి కమ్మలు బయటకు రావడం లేదంటూ ట్వీట్ చేశారు.. బాబు విజయం తర్వాత ఆ సామాజికవర్గం తీవ్ర అసంతృప్తికి గురైన మాట వాస్తవమే.. వాళ్ల నిప్పులుపై ఉప్పు వేసినట్లుగా వర్మ ట్వీట్ చేశారంటున్నారు కొందరు..
ఏదేమైనా.. వర్గ, కుల, ప్రాంత భేదాలకు తావు లేకుండా అభివృద్ది సంక్షేమ ఫలాలు అందరికి అందిస్తాం.. రాగ ద్వేషాలకు తావు లేకుండా.. పార్టీకి సంబంధం లేకుండా ప్రజలందరీ సమానంగా చూస్తానని నవ్యాంద్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఎందుకు వర్మ మళ్లీ కుల విభజనను రేపుతావు అనే విమర్శ కూడా వినిపిస్తోంది... 


Tags:    

Similar News