కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయాలు వివాదాస్పదం అవడంలో కొత్తేమీ లేదు. ఆర్జీవీ ఒక ట్వీట్ చేసినా సినిమా తీసినా అది వివాదంతోనే జనాల్లో వెళ్తుంది. వాస్తవ సంఘటల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన వర్మ.. వాటి ద్వారా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే నేను నిజ జీవితంలోని ఏ పాత్రను ఉద్దేశించి తీయలేదని ఆర్జీవీ తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ''ఆశ ఎన్కౌంటర్'' సినిమాతో మరో వివాదానికి తెర లేపారు. ఈసారి ఏకంగా మను ధర్మ శాస్త్రాన్ని టార్గెట్ చేశారు వర్మ.
యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ దుర్ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ''ఆశ ఎన్కౌంటర్'' చిత్రాన్ని రూపొందించారు. 2019 నవంబర్ 26న నగర శివారులోని చటాన్ పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేసిన సంఘటననే తెర మీద ఆవిష్కరిస్తున్నారు. కాకపోతే వర్మ మాత్రం ఎప్పటిలాగే ఇది ఎవరిని ఉద్దేశించి తీసినది కాదని.. కల్పితమని ప్రకటించారు. నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అనౌన్స్ చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
నిజానికి ముందుగా 'దిశా ఎన్కౌంటర్' అనే టైటిల్ తో ఈ సినిమా స్టార్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ''ఆశ ఎన్కౌంటర్'' గా పేరు మార్చారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. 'ఈ చిత్రం ఏ వ్యక్తుల పైన ఏ ఘటనల పైన ఆధారపడి తీయలేదు.. కేవలం కల్పితం మాత్రమే’ అనే ఆర్జీవీ మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించింది. కాకపోతే అంతకంటే ముందు ''జంతువులను, బడుగు బలహీన వర్గాలను, ఆడవాళ్ళని హింసించడంలో తప్పులేదు" అని మను ధర్మ శాస్త్రం చెబుతుందని కోట్ చేయడమే వివాదాస్పదం అవుతోంది.
హిందువులు ఆచరించే మను ధర్మ శాస్త్రాన్ని రామ్ గోపాల్ వర్మ కించపరుస్తున్నారని.. మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 'ఆశ ఎన్కౌంటర్' సినిమాలో ఒక అమ్మాయిని అత్యంత క్రూరంగా చంపడం.. బలహీన వర్గాలకు చెందిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి వధించడం వంటివి మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించే చేశారనే విధంగా ఆర్జీవీ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. జంతువులను, బడుగు బలహీన వర్గాలను, ఆడవాళ్ళని హింసించమని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నట్లు పేర్కొనడం తగదని వర్మ మీద ఫైర్ అవుతున్నారు. మరి ఇది రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
కాగా, రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో రూపొందిన ‘ఆశ ఎన్కౌంటర్’ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ సినిమాని నిర్మించారు.