క‌రోనా క‌ర్ఫ్యూపై ఆర్జీవీ సెటైర్లు.. కుంభ‌మేళా కోస‌మేనంటూ ట్వీట్‌!

Update: 2021-04-16 08:33 GMT
దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక రోజు న‌మోద‌య్యే కేసుల సంఖ్య 2 ల‌క్ష‌ల‌కు చేరింది. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు సినిమా థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న తెచ్చాయి. మ‌హారాష్ట్ర‌లో అన్నింటినీ బంద్ చేస్తూ ఉద్ద‌వ్ స‌ర్కారు ఆదేశాలు జారీచేసింది.

ప్ర‌భుత్వ ప్రైవేటు కార్యాల‌యాల‌తోపాటు షాపింగ్ మాల్స్‌, రెస్టారెంట్లు, సినిమా థియేట‌ర్లు, సినిమా షూటింగులు మొత్తం నిలిపేసింది. 14వ తేదీ రాత్రి నుంచి మొద‌లైన ఈ క‌ర్ఫ్యూ.. మే 1వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారు. సీబీఎస్ఈ ఎగ్జామ్స్ కూడా నిలిపేశారు. ఇంతా చేస్తే.. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో మాత్రం కుంభ‌మేళా భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. ఏకంగా 6 ల‌క్ష‌ల మందికిపైగా ఒక్క చోట చేరి గంగాస్నానాలు ఆచ‌రిస్తున్నారు.

దీనిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఈ వ్య‌వ‌హారంపై సెటైర్లు వేశారు. ‘‘ఎగ్జామ్స్ ఆపేశారు, వ్యాపారాలు, థియేట‌ర్లు మూసేశారు. మొత్తం ప‌నుల‌న్నీ నిలిపేశారు. ఎందుకంటే.. క‌రోనా కోసం కాదు.. జ‌నాలంతా కుంభ‌మేళాకు వెళ్లడానికి, రాజ‌కీయ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొనడానికి! ఈ ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం సెలవులు ప్ర‌క‌టించింది’’ అంటూ సెటైర్లు వేశారు ఆర్జీవీ.

ఇంత‌మంచి ప‌నిచేసిన ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ విష‌య‌మై వ‌ర్మ‌ వ‌రుస ట్వీట్లు చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్ర‌భుత్వాల తీరుపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News