‘షకీలా..’ ఇది ఒక పేరు కాదు. శృంగార చిత్రాల బ్రాండ్. ఇప్పటి యూత్ కు ఈ పేరు పరిచయం లేకపోవొచ్చుగానీ.. 90 దశకంలోని యువకులను అడిగితే చెప్తారు షకీలా రేంజ్ ఏంటో.. ఆమెకున్న క్రేజ్ ఏంటో. విరహ వేదన పడుతున్న యూత్ కి, సినిమాల్లో సర్వం కోల్పోయిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఆమె కలల రాణి. షకీలాతో ఒక్క సినిమా చేస్తే చాలని ప్రొడ్యూసర్స్.. ఒక్క సినిమా చూస్తే చాలని యూత్ ఆరాాటపడేవారంటే అతిశయోక్తి కాదు. అసలు.. షకీలా మూవీ విడుదల అవుతోందంటే పేరున్న పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ కూడా వాయిదా పడేవంటే ‘షకీలా వేవ్’ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఆఫ్ ది స్క్రీన్ షకీలా జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. సొంత కుటుంబంతోపాటు.. చాలా మంది మోసం చేశారంటూ షకీలా స్వయంగా పలుమార్లు వెల్లడించింది. వీటన్నింటినీ బేస్ చేసుకొని ఆమె బయోపిక్ ను తెరకెక్కించారు. ‘షకీలా’ పేరుతోనే వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రంలో షకీలా పాత్రలో మళయాల నటి రిచా చద్దా నటించారు. ఇటీవల ‘మీర్జాపూర్’ సిరీస్‌తో అలరించిన నటుడు పంకజ్ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించారు.
సినిమా విడుదల నేపథ్యంలో నటి రిచా చద్దా మాట్లాడుతూ.. ‘షకీలా’ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాా తీయాలని డైరెక్టర్ చెప్పిన తర్వాత తాను షకీలాను కలిశానని, ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, స్టార్‌డమ్ తోపాటు చాలా విషయాలు అర్థం చేసుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. మలయాళ పరిశ్రమలో షకీలాను పెద్ద స్టార్‌గా తీర్చిదిద్దిన చిత్రాలన్నిటినీ తాను చూశానని చెప్పింది. ‘మొదటిసారి, నేను ఒక విలక్షణమైన, వివాదాస్పద వ్యక్తి పాత్ర చేశాను ఇది కొత్త రకమైన అనుభవం’ అన్నారు రిచా.
‘షకీలాకు నా పని గురించి పెద్దగా తెలియదు. కానీ.. నేను ఆమె గురించి చాలా తెలుసుకున్నాను. ఆమె గొప్ప మహిళ. ఎవరికీ చెడు చేసే మనస్తత్వం కాదు ఆమెది. అది తనలో చాలా గొప్ప గుణం’ అన్నారు. చాలా సందర్భాల్లో చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండే షకీలా.. అందరినీ ప్రేమగా చూస్తుందని చెప్పింది రిచా. కాగా.. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.