చెప్పకుండా మాయైపోయింది అందుకేనట

Update: 2016-09-01 05:30 GMT
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా ఈ మధ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి చెక్కేసింది. లాస్ట్ వీకెండ్ మొత్తం అసలు ఈమె ఏమైపోయింది ఇంట్లోవాళ్లకి కానీ.. కనీసం ఫ్రెండ్స్ కి కానీ తెలియదు. కనీసం ఫోన్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో రిచా తరపు వారంతా తెగ కంగారుపడిపోయారు. ఆ తర్వాత తీరిగ్గా తిరిగొచ్చిన ఈ మసాన్ బ్యూటీ.. అసలు ఎందుకు మాయైపోయిందో అప్పుడు అసలు విషయం చెప్పింది.

'ఏదైనా కష్టమైన రోల్ చేయాలంటే.. ఇప్పుడున్న రిలేషన్స్ ను  బ్రేక్ చేసి ఎటైనా వెళ్లడం చాలా ముఖ్యం. మనం ఒక మొబైల్ ఫోన్ నే 30 నిమిషాలకు మించి చూడకుండా ఉండలేకపోతున్నాం. అలాంటిది ఒక రోల్ పై దృష్టి పెట్టాలంటే.. మొబైల్ ఫోన్ నే కాదు.. వేరే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఇలా వెళ్లొచ్చాను' అని చెప్పింది రిచా. సరబ్ జిత్.. క్యాబరే వంటి కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకున్న ఈమె.. త్వరలో ఫర్హాన్ అక్తర్ నిర్మించే ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయనుంది. ఇది క్రికెట్- పాలిటిక్స్ బేస్డ్ నడవనుండగా.. రిచా చద్దాది లీడ్ రోల్.

రిచా చెప్పిన ఎపిసోడ్ వింటుంటే.. కొన్ని నెలల క్రితం రామన్ రాఘవ్ 2.0 కోసం నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలానే ప్రవర్తించిన సంఘటన గుర్తుకు రాక మానదు. ఆ హీరో అయితే ఏకంగా వారం రోజుల పాటు ఎవరికీ కాంటాక్ట్ లో లేడు. ఇప్పుడు రిచా చద్దా ఇలాగే చేసింది. కేరక్టర్ కోసం ఇలా మాయమైపోవడం ఏంటో.. వీళ్ల కమిట్మెంట్ ఏంటో.. మరీ ఎక్కువగా అనిపించడం లేదూ!
Tags:    

Similar News