ధియేటర్లలో ఓ పెద్ద కమర్షియల్ సక్సెస్ కొడుతుందా లేదా చెప్పలేం కాని.. ఇప్పటివరకు ''సరబ్జిత్'' కేవలం 16 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ వారంలో ఏమన్నా పుంజుకొని మరో 30 కోట్లు వసూలు చేస్తేనే.. నిర్మాతకు హిట్టొస్తుంది. అదే.. ప్రాఫిట్లు వస్తాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు సరబ్జిత్ వైఫ్ క్యారెక్టర్ లో మెరిసన హీరోయిన్ రిచా చద్దా.. కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.
''నిజానికి సారబ్జిత్ సినిమాలో నేను ఎంతో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ చేశాను. కాని ఎడిటింగ్ లో దాదాపు 5 సీన్లు తీసేశారు. దాని వలన నిజ జీవితంలో సారబ్జిత్ భార్య ఎంత కష్టాలు పడింది అనే విషయం జనాలకు తెలియకపోవడం అటుంచితే.. ఆ తరువాత అసలు నేను ఇటువంటి చిన్న క్యారెక్టర్ చేశానని నా ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. మసాన్ వంటి సినిమా విజయం సాధించాక.. అసలు ఇలాంటి చిన్న క్యారెక్టర్లు నాకు అవసరం లేదు. అందుకే నేను మోసపోయానేమో అనిపిస్తోంది. ఇకపై ఇటువంటి క్యారెక్టర్లు చేయను'' అంటూ సెలవిచ్చింది రిచా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాతో ఈమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
అయితే సారబ్జిత్ సినిమాలో తన సీన్లే కాదని.. ఒక్క రణదీప్ హుడా తప్పించి.. ఐశ్వర్య రాయ్ సీన్లు కూడా కట్ చేశారని.. సినిమా లెంగ్త్ ఎక్కువుంటే బాగుండేదని చెప్పుకొచ్చింది. పంచ్ వేశాక.. మళ్ళీ ఈ బటరింగ్ ఎందుకులే.