గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు దక్షిణాది సినీ పరిశ్రమను వెంటాడుతున్నాయి. ముందు సుచిలీక్స్ నుంచి మొదలైన వివాదం.. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మరింత వేడెక్కాయి. దీనికి కొంతమంది సీనియర్ నటీమణలు కూడా వంత పాడడంతో.. ఇండస్ట్రీపై పడిన మచ్చ తుడిచేయడం కష్టంగా మారుతోంది.
ఇప్పుడు రిచా గంగోపాధ్యాయ రూపంలో టాలీవుడ్ కు సపోర్ట్ దొరికింది. మిర్చి మూవీలో ప్రభాస్ కి జోడీగా నటించి ఆకట్టుకున్న రిచా.. సినీ పరిశ్రమపై వచ్చిన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. "టాలీవుడ్ పరిశ్రమ చాలా ప్రొఫెషనల్. ఇలాంటి సెక్సిస్ట్ ప్రతిపాదనలు నా దగ్గరకు ఎపుడూ రాలేదు. మహిళలపై వేధింపులు అనేది ప్రతీ చోటా ఉంటాయి. కేవలం సినీ పరిశ్రమపైనే ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదు" అని చెప్పింది రిచా.
అంతే కాదు.. తాను తెలుగు.. తమిళ్ రెండు భాష్లలోనూ పలు సినిమాలు చేశానన్న రిచా.. ఏ నటుడు కానీ.. ఫిలిం మేకర్ గానీ.. అడ్వాన్స్ అవడం చూడలేదని చెప్పింది. "మహిళలు ధృడంగా ఉంటే.. వారితో అసంబద్ధంగా అడ్వాన్స్ అయేందుకు ఎవరూ ప్రయత్నించరు" అంటూ రిటార్ట్ కూడా ఇచ్చేసింది. ఈమె లీడర్.. మిరపకాయ్.. మిర్చి మూవీలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/