హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడుతున్నాడు సుమంత్ అశ్విన్. తండ్రి ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో చేసిన తొలి సినిమా ‘తూనీగ తూనీగ’ దెబ్బ కొట్టినా.. ఆపై అంతకుముందు ఆ తరువాత.. లవర్స్ లాంటి సినిమాలతో విజయాలందుకున్నాడు. కానీ చక్కిలిగింత-కొలంబస్ లాంటి సినిమాలు అతణ్ని మళ్లీ కిందికి తీసుకొచ్చేశాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ‘రైట్ రైట్’ మీదే పెట్టుకున్నాడు అశ్విన్. పెద్దగా అంచనాల్లేకుండా వస్తున్న ఈ సినిమాకు సరైన పబ్లిసిటీ కూడా చేయకుండా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఏ సందడీ లేకుండా దీని థియేట్రికల్ ట్రైలర్ ను మీడియాకు రిలీజ్ చేశారు.
అనగనగా ఓ హిల్ స్టేషన్.. అక్కడ ‘గవిటి’ అనే ఊరికి నడిచే ఆర్టీసీ బస్సులో హీరో కండక్టర్.. అతడి స్నేహితుడు డ్రైవర్. ఈ బస్సు ప్రయాణంతో సరదాగా వీళ్ల జీవితం సాగిపోతుంటుంది. హీరో ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో వీళ్లు ఓ సమస్యలో చిక్కుకుంటారు. హీరో పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి.. దాన్నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. థ్రిల్లర్ లక్షణాలున్న ఈ కథ మలయాళం నుంచి అరువు తెచ్చుకున్నది. అక్కడ విజయవంతమైన ‘ఆర్డినరీ’ అనే సినిమా ఆధారంగా కొత్త దర్శకుడు మను ఈ చిత్రాన్ని రూపొందించాడు. సుమంత్ సరసన పూజా జవేరి కథానాయికగా నటిస్తోంది. కాలకేయ ప్రభాకర్ ఓ కీలక పాత్ర పోషించాడు. వంశీ కృష్ణ నిర్మాత. మే నెలలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Full View