'రైజ్ ఆఫ్ శ్యామ్' ప్రోమో: శ్యామ్ సింగ రాయ్ ఒక లెజెండ్ గా ఎదిగిన వైనం..!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు - మోషన్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా 2021 డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న మేకర్స్.. ''రైజ్ ఆఫ్ శ్యామ్'' అనే పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఫస్ట్ సింగిల్ ని వదలబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా పాట ప్రోమోని నాని ట్విట్టర్ లో షేర్ చేశారు. 'అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్..' అంటూ సాగిన ఈ ప్రోమో అలరిస్తోంది.
'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టైటిల్ సాంగ్ ప్రోమోని కూడా నాలుగు భాషల్లో వదిలారు. దీనికి మిక్కీ జె మేయర్ మేజర్ ట్యూన్ కంపోజ్ చేశారు. తెలుగు వెర్సన్ కు కృష్ణ కాంత్(కె.కె) సాహిత్యం అందించారు. నాలుగు దక్షిణాది భాషల్లోనూ ఈ పాటను విశాల్ దడ్లానీ - అనురాగ్ కులకర్ణి కలిసి ఆలపించడం విశేషం.
1970 లో కలకత్తా లో ఒక లెజెండ్ గా ఎదిగిన శ్యామ్ సింగ రాయ్ గురించి 'రైజ్ ఆఫ్ శ్యామ్' సాంగ్ వివరిస్తోందని ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. అతని ఎదుగుదల ప్రేరణగా ఉండబోతోందని.. అతని మార్గం ఒక విప్లవమని దర్శకుడు చెబుతున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రెడీ అవుతుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రోమో కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. పూర్తి పాట ఎలా ఉంటుందో చూడాలి.
''శ్యామ్ సింగరాయ్'' చిత్రంలో నాని రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ జంగా దీనికి కథ సమకూర్చారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.
Full View