రిషి కపూర్ అంటే ఏ రేంజ్ రొమాంటిక్ హీరోనో అందరికీ తెలిసి విషయమే. అటు ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ రిషి రొమాన్సులపై చాలానే కథలు వినిపిస్తాయి. మరి రొమాంటిక్ హీరోకి.. ఓ రిలేషన్ మాత్రం నచ్చదేమో అనిపిస్తోంది. పైగా రేపు రక్షాబంధన్ పండగ కూడాను. ఆ పండగ నచ్చలేదో.. లేక ఆ రిలేషన్ నచ్చలేదో కానీ.. ఇప్పుడీయన పెట్టిన ఓ ట్వీట్ మాత్రం సెన్సేషన్ అయిపోతోంది.
వివాదాస్పదమైన ట్వీట్స్.. కామెంట్స్ విషయంలో ఈ సీనియర్ కపూర్ కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయచ్చు కానీ.. ఇప్పుడు రాఖీ పండగ టైమ్ లో చేసిన ట్వీట్.. ఈయనలో ఏ రేంజ్ రొమాంటిక్ ఆలోచనలుంటాయో అద్దం పడుతుంది. రక్షా బంధన్ అంటేనే రాఖీ పండుగ. తమ సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీ. అలాంటిది 'రాఖీ కట్టడం'కు కొత్త అర్ధం చెప్పాడు రిషి కపూర్. 1978లో వచ్చిన 'కశ్మే వాదే' మూవీలో హీరోయిన్ రాఖీ గుల్జార్ ని కట్టేసిన ఫోటోను పోస్ట్ చేసిన రిషి.. 'రాఖీని కట్టే విజువల్.. ఎంజాయ్ సిస్టర్స్' అంటూ కామెంట్ చేశాడు.
తనకు రాఖీ కడితే పరిస్థితి ఇలా అని బెదిరించాడో.. లేక సందర్భం వచ్చింది కదా అని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడో అంత ఈజీగా చెప్పలేం కానీ.. రాఖీ కట్టడానికి కొత్త అర్ధం అయితే చెప్పేశాడు రిషి కపూర్. ఇలాంటి విషయాల్లో ఈయన బాగా ముదురులెండి. గతంలో కిమ్ కర్దాషియన్ ఫోటోను.. ఉల్లిపాయల మూటను పక్కపక్కనే పోల్చి చూపించాడు కూడా.