హీరోయిన్ కరీనా కపూర్ తనకు కొడుకు పుట్టినప్పటినుండి తెగ వార్తల్లో నానుతోంది. అమ్మడుకి డిసెంబర్ 20న కొడుకు పుడితే.. అప్పుడే నడుచుకుంటూ హస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసి అమ్మడు కొడుకు అభిమానులకు చూపించేసింది కూడా. అయితే ఈ బిడ్డకు తైమూర్ ఆలీ ఖాన్ పేరు పెట్టడం ఇప్పుడు పెద్ద అగ్గినే రాజేసింది.
ఒక విధంగా చరిత్రను చూస్తే.. అలెగ్జాండర్.. చెంగిజ్ ఖాన్ చేయలేకపోయిన సాహసం తైమూర్ చేశాడు. మనోడు 1398లో ఢిల్లీ ని ఎటాక్ చేసి.. ఏకంగా లక్ష మంది ప్రజలను దారుణంగా చంపేశాడు. ఢిల్లీ సుల్తాన్ అయిన తుగ్లక్ దగ్గర ఏనుగుల బలం ఉందని గుర్తించి.. మనోడు ఒంటెలకు కట్టెలు కట్టి.. వాటికి నిప్పంటించి.. వాటిని ఇనుప రాడ్లతో కొట్టి..ఏనుగుల మీదకు వదిలి.. సుల్తానేట్ సైన్యాన్ని నాశనం చేశాడు. ఆ తరువాత మూడు రోజులు ఢిల్లీలో అందరినీ చంపేసి.. తలలు గోడలకు వేలాడతీసి.. బాడీలను పక్షులకు వేసేశాడు. అలాంటి తైమూర్ పేరు కరీనా తన కొడుక్కి ఎలా పెడుతుంది అంటూ ట్విట్టర్ ఫేస్ బుక్ సాక్షిగా నెటిజన్లు రెచ్చిపోయారు.
అయితే ఈ విషయం స్పందించిన మాజీ హీరో.. కరీనా బాబాయ్ రిషి కపూర్.. ''తన కొడుక్కి ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల ఇష్టం. ఆ మాటకొస్తే అలెగ్జాండర్.. సికందర్ వంటి వారు గొప్పోళ్ళేం కాదు. మీ కూతురు పేరును మీరు పెట్టుకోండి. తనకు నచ్చిన పేరు తను పెట్టుకుంటుంది. షట్ ది ఫక్ అప్'' అంటూ ట్వీటేశాడు రిషి సాబ్. ఆ విధంగా బూతులు తిట్టడం కూడా చాలామందికి నచ్చలేదు.