బీహార్‌ బ్యాన్‌.. మాజీ హీరో కామెడీ

Update: 2016-04-06 12:10 GMT
బిహార్ లిక్కర్ బ్యాన్ పై సీనియర్ నటుడు సీరియస్.. బిహార్ లో ఇప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. అన్ని రకాల మద్యం - సేవనం - సరఫరా.. ఇలా లిక్కర్ కు సంబంధించిన ప్రతీ ఒక్క అంశాన్ని బ్యాన్ చేశారు. గుజరాత్ - మణిపూర్ - నాగాలాండ్ తర్వాత 100శాతం మద్య నిషేధం అమలు చేస్తున్న రాష్ట్రంగా బిహార్ నిలిచింది. అయితే.. ఇలా మద్యాన్ని నిషేధించడాన్ని సీనియర్ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ సీరియస్ గా తీసుకున్నారు.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ట్విట్టర్ సాక్షిగా వెటకారం ఆడారు రిషికపూర్. ఇలా మద్యాన్ని నిషేధించడం అక్రమ రవాణా - అక్రమ మద్యాన్ని ప్రోత్సహించడమేనన్నది ఈయన అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మద్యనిషేధం సక్సెస్ కాలేదని చెప్పిన రిషి.. ఇలా చేయడంతో 3వేల కోట్ల రూపాయల రెవెన్యూ కోల్పోతారని గుర్తు చేశారు. 'అక్రమంగా మద్యం నిల్వ చేస్తే పదేళ్ల జైలు... అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే ఐదేళ్లు జైలు.. వాహ్ నితీష్. నేను ఇక బిహార్ కి రాను' అంటూ ట్వీట్ చేశారు రిషి కపూర్.

ఇది వెటకారంగా కనిపిస్తున్నా.. ఇందులో వాస్తవం కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తను 1983లో విడుదలైన కూలీ మూవీలో ఫోటోను ట్వీట్ చేసిన రిషి.. అప్పటి నుంచి మద్యం తాగుతున్నానని అన్నారు. అయితే.. ఆ ఫోటోపై మాత్రం ధూమపానం - మద్యపానం ప్రాణానికి హాని చేస్తుంది, దూరంగా ఉండమని క్యాప్షన్ ఉంచారు రిషి కపూర్.
Tags:    

Similar News