ఇప్పుడు 'జయ జానకి నాయక' సినిమాపై వినిపిస్తున్న అతి పెద్ద రూమర్ ఏంటంటే.. ఈ సినిమా ఫోటోగ్రాఫీకే కేవలం 4 కోట్లు పైన ఖర్చయ్యిందని. అయితే నిజంగానే అంత ఖర్చు పెట్టేసి మనోళ్లు ఏమన్నా క్రిస్టోఫర్ నోలాన్ తరహాలో 'డన్ క్రిక్' వంటి సినిమా తీశారా అంటూ మనం షాకవచ్చు. కాని నిజానికి ఈ ఖర్చు వెనుక మతలబు వేరు. ఇలా ఫోటోగ్రాఫి గురించి మాత్రం చెప్పుకోవడం అసలు వేస్ట్ ఆఫ్ టైమ్.
అప్పట్లో ఈ సినిమాటోగ్రాఫ్ రిషి పంజాబి గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''మా వాడు (బన్నీ) యాడ్ ఫిలింస్ తీసే ఇతనే కావాలన్నాడు. రోజుకు లక్ష రూపాయలు తీసుకునే సినిమాటోగ్రాఫర్ తో మనం చేయగలమా అనుకున్నాం. కాని అతను ఇచ్చిన క్వాలిటీ అద్భుతంగా ఉంది'' అంటూ రిషి పంజాబీని పొగిడేసి.. అతని పేమెంట్ డీటైల్స్ చెప్పేశాడు. అక్కడ నుండి జనాలు ఇతని ఫోటోగ్రఫి చాలా ఖరీదైంది అనేసుకుంటున్నారు. కాని ఇక్కడే ఒక విషయం గమనించాలి. మన దగ్గర హిట్ సినిమాటోగ్రాఫర్లు ఎవరైనా కూడా కోటి రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి 120 రోజుల షూటింగ్ అంటే రిషి పంజాబీకి ఇచ్చే 1.2 కోటి పెద్ద ఎక్కువేం కాదు. ఇకపోతే ఈయనేదో ప్రత్యేక ఎక్విప్ మెంట్ వాడి స్టయిలిష్ లుక్ తెచ్చాడు కాబట్టి.. చాలా ఖరచ్చయ్యిందని అంటున్నారు కాని.. అలాంటిదేం లేదు. పెద్ద హీరోల సినిమాలన్నింటికీ వాడేవి అవే కెమెరాలు.. అవే లెన్సులు.. అవే లైట్లు. మహా అయితే ఓ రెండో కెమెరా.. కాసినన్ని ఎక్కువ లైట్లు అద్దెకు తీసుకుంటారేమో. అలాగే క్రేన్లు జిమ్మీ జిబ్ లు కూడా ఓ రెండు ఎక్స్టా తీసుకోవచ్చు. వాటి ఖర్చు ఎంతో అవ్వదు. ఒక హీరో-హీరోయిన్ ఫుడ్ బిల్ అంత కూడా ఉండదు నిజం చెప్పాలంటే.
కాబట్టి ఎలా చూసుకున్నా కూడా రిషి పంజాబీ కారణంగా ఫోటోగ్రాఫీకి విపరీతంగా ఖర్చయ్యింది అనడం కాస్త సోదే. దర్శకుడు ఎన్ని ఎక్కువ రోజులు షూట్ చేస్తే ప్రొడక్షన్ వ్యయం అంత ఖర్చవుతుంది. కాబట్టి ఆ క్రెడిట్ డైరక్టర్ బోయపాటి శ్రీను ఖాతాలో వేయాలి.. ఒకవేళ ఏమన్నా డిలే అయ్యుంటే!!