నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయానించే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న లోపాన్ని గుర్తించారు బాలీవుడ్ నటుడు ఒకరు. తాజాగా ఆ లోపాన్ని తన సెల్ కెమేరా నుంచి షూట్ చేయటమే కాదు.. ఆ అంశాన్ని సోషల్ మీడియాలో తెలిపిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్.. అదేనండి మన జెనీలియా భర్త ఉన్నారు కదా. ఆయన మొన్న (సోమవారం) హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంజ్ లోని లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న సమయంలో కరెంటు పోయిందట. దీంతో.. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది.
దీంతో అక్కడ ఉన్న ఒకే ఒక్క ఎగ్జిట్ డోర్ కూడా తెరుచుకోలేదు. కొన్ని క్షణాల వ్యవధిలోనే లిఫ్ట్ మళ్లీ పని చేసిందని చెబుతూ.. ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎగ్జిట్ డోర్ తెరుచుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు.ఈ విషయంపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించాలని కోరారు. రితేష్ ట్వీట్ కు స్పందించారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది. అత్యవసర సందర్భాల్లో ఎగ్జిట్ డోర్ బద్దలు కొట్టొచ్చని.. అక్కడే ఉన్న బాక్సులో కీ కూడా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో విలువైన ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న లోపాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.