దుల్క‌ర్ కోసం ఐట‌మ్ పాప‌గా మారింది!

Update: 2022-11-13 07:30 GMT
విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ మ‌ల‌యాళ‌, తులుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వరుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాడు విల‌క్ష‌ణ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌. తెలుగులో `సీతారామం` మూవీతో డీసెంట్ ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న దుల్క‌ర్ ఆ వెంట‌నే సైకో పాత్ర‌లో న‌టించి సంచ‌ల‌నం సృష్టించి మూవీ `చుప్ : రివేంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్‌`. బాలీవుడ్ ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ ఆర్. బాల్కీ తెర‌కెక్కించిన ఈ మూవీ అక్క‌డ కూడా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది.

బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ ల త‌రువాత టాలెంటెడ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న మ‌ల‌యాళ మూవీ `కింగ్ ఆఫ్ కోతా`. మ‌ల‌యాళ చిత్ర సీమ‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న జోషీ త‌న‌యుడు, దుల్క‌ర్ స్నేహితుడు అభిలాష్ జోషీ ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. జీ స్టూడియోస్ తో క‌లిసి హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తూ ఈ మూవీని స్వీయ నిర్మాణ సంస్థ వే ఫేర‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నాడు.

`కురుప్‌` త‌ర‌హాలో ఇదొక గ్యాంగ్ స్ట‌ర్ మూవీ. శాన్ రెహ‌మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో వుంది. ఇందులో దుల్క‌ర్ కు జోడీగా స‌మంత న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే ఇందులో హీరోయిన్ గా ఐశ్వ‌ర్య ల‌క్ష్మి న‌టిస్తోంది. శాబీర్ క‌ల్లార‌క్క‌ల్‌, గోకుల్ సురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

`అత‌డికి కొంత మంది భ‌య‌ప‌డ‌తారు... మ‌రికొంత మంది గౌర‌విస్తారు.. ఇంకొంత మంది ప్రేమిస్తారు కానీ,.,అత‌ని నిజ‌స్వ‌రూపం తెలిసిన వాళ్లు చాలా తక్కువ మందే` అంటూ దుల్క‌ర్ `కింగ్ ఆఫ్ కోతా` ఫ‌స్ట్ లుక్ సంద‌ర్భంగా టీమ్ షేర్ చేసిన పోస్ట్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

స‌న్న‌ని మీసం.. మాసిన గ‌డ్డం.. క‌ర్లింగ్ హెయిర్ తో దుల్క‌ర్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం వెంక‌టేష్ హీరోయిన్ రితికా సింగ్ తొలిసారి ఐట‌మ్ పాప‌గా మారిపోతోంది. బాక్స‌ర్‌, బిచ్చ‌గాడు 2, వ‌నాంగ‌ముడి వంటి సినిమాల్లో న‌టిస్తున్న రితిక మంచి క‌మ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. అందుకు దుల్క‌ర్ సినిమాని వేదిక‌గా ఎంచుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో తొలి సారి ఐట‌మ్ సాంగ్ లో క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌లే రామ‌నాథ‌పురంలో దుల్క‌ర్ పాల్గొన‌గా రితికా సింగ్ పై స్పెష‌ల్ ఐట‌మ్ నెంబ‌ర్ ని షూట్ చేశార‌ట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News