పెళ్ళి చూపులు పిల్ల బాగా ఫీలైందట

Update: 2016-08-30 15:30 GMT
ఈ మధ్యకాలంలో సడన్ గా పాపులర్ అయిపోయిన బ్యూటి అంటే.. పెళ్ళిచూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చేసిన రీతూ వర్మ అనే చెప్పాలి. అయితే ఈ అమ్మడు 'అభిషేక్ పిక్చర్స్' వారు తీస్తున్న అడివి శేష్‌ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుని.. ఇప్పుడు అదే బ్యానర్ లో నిఖిల్ హీరోగా స్వామిరారా ఫేం సుధీర్ వర్మ తీస్తున్న సినిమాకు జంపైంది. ఈ విషయంపై అమ్మడి కితకితల గురించి మీడియాలో బోలెడంత న్యూస్ రావడంతో బాగా ఫీలైందట.

రూమర్ ఏంటంటే.. అడివి శేష్‌ సినిమాలో ఈమెకు ఆఫర్ చేసిన పాత్ర అంతగా ఇంప్రెసివ్ గా లేకపోవడం.. పైగా తన పాత్ర ద్వారా జరిగే కత కూడా ఏమీ లేకపోవడంతో.. అమ్మడు ఆ సినిమాను వదులుకుని.. నిఖిల్ సినిమాలోకి జంప్ అయ్యింది అని టాక్. కాకపోతే మరీ కెరియర్ ఇలా స్టార్టింగ్ స్టేజీలో ఉన్నప్పుడే ఇలా జంపింగులు కొడుతోందంటే.. ఇంకో రెండు హిట్లు పడితే పరిస్థితి చూసుకోండి అంటూ మీడియాలో పంచులు పేలాయి. ఇవన్నీ తెలుసుకున్న రీతూ.. అసలు అడివి శేష్‌ సినిమాను వదిలేశానా లేదా అనే విషయం ఎవ్వరికీ చెప్పలేదని.. అదే బ్యానర్ లో నిఖిల్ సినిమాను కూడా సైన్ చేశానంతే.. అంటూ వాపోయింది.

స్టార్డమ్ తో పాటు మీడియాలో వచ్చే న్యూసును హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకోవాలిగా. ఒకవేళ ఇలాంటి మిస్ ఇంటరప్రెటేషన్స్ అనేవి జరగకపోతే.. రూమర్లను ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంపై క్లారిటీ రాదులే. అంతా మన మంచికే అనుకో రీతూ!!
Tags:    

Similar News