సౌత్ సినిమాకే కాదు - అతడు ఇండియన్ సినిమాకే గురుడు. ఆ రేంజులో రిచ్ గా ఆలోచించేవాడు.. విజువల్ రిచ్ సినిమా చూపించే మొనగాడు ఇంకొకడు లేనేలేడు. ఉన్నా మరీ అంత కాదు! అందుకే ఆయనంటే అందరిలో గుర్తింపు.. అంతకుమించిన గౌరవం. జయాపజయాలతో పనే లేకుండా ప్రపంచం మొత్తం అతడిని అభిమానిస్తుంది. అతడెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ది గ్రేట్ శంకర్.
మందలో గొర్రెలా ఉంటే ఏం గుర్తింపు. మందనే నడిపించే గొర్రెలా ఉంటేనే గుర్తింపు! అని భావించే రకం ది గ్రేట్ డైరెక్టర్ శంకర్. అందుకే ఆ ప్రత్యేకతను ప్రతిసారీ నిలుపుకుంటూనే ఉన్నాడు. ఒక్కోసారి ఫెయిల్యూర్ వెక్కిరించినా - మెజారిటీ కెరీర్ సక్సెస్సే. సినిమా అంటే అతడికి ఉన్న విపరీతమైన ఫ్యాషన్ అతడిని ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగేలా చేసింది. మేధోతనానికి ధనప్రవాహం తోడైతే - విజువల్ వండర్స్ రుచి చూపించవచ్చని నిరూపించిన గ్రేట్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు శంకర్ బర్త్ డే. ఇలాంటి కీలకమైన రోజు లైకా సంస్థ తీరని ద్రోహం తలపెట్టింది. శంకర్ అభిమానులకు విజువల్ బిరియానీ దొరక్కపోయినా కనీసం బర్త్ డే కేక్ కూడా తినిపించలేదు. కనీసం ఇలాంటి ఇంపార్టెంట్ డేని గుర్తుంచుకుని `2.ఓ` టీజర్ అయినా రిలీజ్ చేయాలన్న జ్ఞానాన్ని కూడా ప్రదర్శించలేదు. ఎట్ లీస్ట్ కనీసం కొత్త లుక్ అయినా..లాంచ్ చేయాలన్న విజ్ఞతి ప్రదర్శించలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శంకర్ అభిమానులు ఈ రేంజులోనే తిట్టేసుకుంటున్నారు. ఒక గ్రేట్ డైరెక్టర్ కి ఈ మాత్రం గుర్తింపు అయినా ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు.
దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గురించి కించిత్ వివరం అయినా తెలీనివ్వకుండా ఎందుకు దాచేస్తున్నారు? అసలింతకీ నవంబర్ 29న ఈ సినిమాని రిలీజ్ చేస్తారా.. లేదా? అసలు కనీసం క్లూ అయినా ఇవ్వడం లేదు. ఎవరికి వాళ్లు వీఎఫ్ ఎక్స్ పనులు అంటూ తప్పించుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఇలా అయితే సూపర్ స్టార్ రజనీ అభిమానులు ఊరుకుంటారా? శంకర్ అభిమానులు తట్టుకోగలరా? షిట్!!