సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 2.0 కోసం సినిమా ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఇండియాలో రూపొందిన అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ మూవీకి లైకా సంస్థ ఇప్పటిదాకా 400 కోట్లకు పైగా ఖర్చు చేయటం సెన్సేషన్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్సులకు సంబంధించిన ఒత్తిడిని తట్టుకోలేక నవంబర్ 29 డేట్ ప్రకటించారని నిజానికి అప్పుడైనా ఖచ్చితంగా వస్తుందా లేదా అని చెప్పలేమని చెన్నై మీడియాలో ఇప్పటికీ టాక్ నడుస్తూనే ఉంది. సరే ఒకవేళ వస్తుందే అనుకున్నా చేతిలో మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే సరిగ్గా 90 రోజులు. దీనికి కలలో సైతం ఊహించని ఓపెనింగ్స్ రావాలి. అదిరిపోయింది అనే టాక్ వస్తే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. కానీ దాని కన్నా ముందు బలమైన ప్రమోషన్ కావాలి. ఇప్పటిదాకా టీజర్ కూడా విడుదల చేయలేదు.
ఇక్కడ మరొక చిక్కు ఉంది. నవంబర్ 29న 2.0 వస్తుంది కాబట్టి దాని దరిదాపుల్లో ఉండకుండా చిన్న సినిమాల నిర్మాతలు దూరంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కనీసం ముందు వెనుకా రెండు వారాల గ్యాప్ ఉండేలా తమ రిలీజ్ డేట్లు షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఒకవేళ నవంబర్ 29లో ఏ మాత్రం మార్పు ఉన్నా మొత్తం ఖంగాళీ అయిపోతుంది. ఒక తమిళ తెలుగు సినిమాలకే కాదు కన్నడ మలయాళం వాటికి కూడా వర్తిస్తుంది. సో వీలైనంత త్వరగా 2.0 టీజర్ లేదా ట్రైలర్ ని రిలీజ్ చేసి 29 డేట్ ని పక్కా చేస్తే మిగిలిన వాళ్లకు టెన్షన్ ఉండదు. అలా కాకుండా మళ్ళి మార్చాల్సి వస్తే మాత్రం చాలా చిక్కులు తప్పవు. ఇప్పటికే లింగా-కబాలి-కాలా డిజాస్టర్లతో రజని సినిమా అంటేనే భయపడే పరిస్థితి ఉంది. 2.0కి శంకర్ బ్రాండ్ తోడు కావడంతో పాటు టెక్నికల్లి టాప్ స్టాండర్డ్ మూవీ అనే పేరు వచ్చింది కాబట్టి బిజినెస్ పరంగా ఇబ్బంది ఉండదు కానీ అసలు తేదీతోనే సమస్య. ఎప్పటికి తీరుస్తారో.