ఇన్నాళ్లు ఫ్యాన్స్ ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. ఓవైపు రజనీ అభిమానులు - మరోవైపు శంకర్ ఫ్యాన్స్ - వేరొక వైపు కిలాడీ అక్షయ్ అభిమానులు ఎంతో సహనం ప్రదర్శించారు. 2.ఓ రిలీజ్ తేదీ ప్రకటించినా ఇంకా నమ్మకం లేనట్టే చూశారు. అందుకే ఆ అసహనానికి చెక్ పెట్టేసేందుకు శంకర్- లైకా & టీమ్ భారీ ప్లానింగే చేశారని అర్థమవుతోంది. ఆ ప్లాన్ లో భాగంగానే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న అదిరిపోయే 3డి టీజర్ చూపిస్తున్నాం అంటూ ప్రకటించారు. ఇంకేం ఉంది.. అప్పటి నుంచి అభిమానులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
అందుకు ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు 450 కోట్ల బడ్జెట్ సినిమా 3డి ట్రైలర్ చూడాలన్న ఉత్కంఠ పెరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ 3డి టీజర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడంతో ఇక్కడా సందడి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ - శంకర్ - అక్షయ్ - రెహమాన్ ఫ్యాన్స్ లో ఒకటే క్యూరియాసిటీ. ఆ క్షణం కోసమే ఈ ఆత్రం. సంపూర్ణంగా ఈ చిత్రాన్ని 3డిలో తీశాం. అందుకే 2డి టీజర్ తో పాటు 3డి టీజర్ ని కూడా థియేటర్లు - యూట్యూబ్ లో చూపిస్తున్నామని శంకర్ బృందం ప్రకటించింది. ఈ 3డి టీజర్ నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది.. అంటూ టెన్షన్ పెట్టేస్తున్నారు.
యూట్యూబ్ లో 2డి - 3డి రెండు వెర్షన్ల టీజర్ ని ఒకేసారి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇండియాతో పాటు విదేశాల్లోనూ దీనిని వీక్షించవచ్చని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు తెలుగు రాష్ట్రాల్లో 3డి వీక్షణకు ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయో అన్న ఆత్రం అభిమానుల్లో ఉంది. మన థియేటర్లలో చాలా వాటిని 3డికి అప్ గ్రేడ్ చేసేస్తున్నామని ఇదివరకూ ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉందింకా. ఇంతకీ `2.ఓ` 3డి టీజర్ ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లలో చూడగలం? ఇప్పటికైతే క్లారిటీ లేదింకా.