భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 2.ఓ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. దాదాపు 600కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిందని రజనీ ట్రైలర్ వేడుకలో చెప్పారు. అందుకు తగ్గట్టే రూ.500కోట్లు పైబడి ప్రీరిలీజ్ బిజినెస్ చేశారు. అయితే అంత పెద్ద మొత్తాన్ని రాబట్టాలంటే ఈ సినిమా రోజురోజుకు టాక్ పుంజుకుని మరింతగా వసూళ్లు పెంచుకోవాల్సి ఉంటుంది. గురువారం - తొలి వీకెండ్ తర్వాత అంతే గొప్ప గా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అయితే 2.ఓకి తొలిరోజు మిక్స్ డ్ టాక్ రావడం అన్నది కొంతవరకూ మైనస్. మొదటిరోజు వసూళ్లను మించి ఈ వీకెండ్ లో అంతకంతకు పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్నా.. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఓవర్సీస్ - తమిళనాడు - ఉత్తరాదిన సన్నివేశం డిఫరెంటుగా ఉందన్న మాట వినిపిస్తోంది.
3డి సాంకేతికతను అత్యుత్తమ స్థాయిలో పరిచయం చేసిన శంకర్ కి ప్రోత్సాహకంగా ఈ సినిమా టెక్నికాలిటీస్ గురించి సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించడంతో జనాల్లో ఆసక్తి పెరిగింది. దాంతో థియేటర్లకు కదిలి వస్తున్నారు. ఇదే పరిస్థితి మునుముందు ఉంటే సరే.. లేకపోతే సన్నివేశం వేరుగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశంలో భారీ పెట్టుబడులు కుమ్మరించిన పంపిణీదారుల గుండెల్లో మరో బాంబ్ ఇప్పుడు నిదుర పట్టనివ్వడం లేదట. ఇంతకీ ఆ బాంబ్ ఏంటో అంటే.. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీ అమెజాన్ పేరు వినిపిస్తోంది.
నవంబర్ 29న ఈ సినిమా రిలీజైంది. బాహుబలి తరహాలో మరో మూడు నాలుగు వారాలైనా ఈ సినిమా స్టడీగా వసూళ్లు సాధిస్తేనే రికవరీ సాధ్యం. లేదంటే సరిగ్గా 50రోజుల్లో (2(నవంబర్ 29)+31(డిసెంబర్)+ 17 జనవరి=50) అమెజాన్ లో ఈ సినిమా లైవ్ కి వస్తుంది. ఒప్పందం ప్రకారం అమెజాన్ ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కి తెస్తుంది. ఎలానూ అమెజాన్ లో లైవ్ కి వస్తుంది కాబట్టి అప్పుడు చూద్దాం అనుకునే బాపతు జనం థియేటర్లకు రాకపోతే ఆ మేరకు కలెక్షన్లపై పంచ్ పడినట్టేనని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాని ప్రీరిలీజ్ హైప్ తో భారీ ధరలకు అమ్మేశారు.. ముఖ్యంగా తమిళనాడులో రజనీ మానియాతో భారీ ధరలకు సేల్ చేశారు. కానీ తమిళ్ కంటే తెలుగు లోనే వసూళ్లు బావున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మెట్రో నగరాల్ని మినహాయిస్తే ఇతర చోట్ల పూర్ కలెక్షన్స్ ఉన్నాయిట తమిళనాడులో. అక్కడ భారీ బెట్టింగ్ చేసిన బయ్యర్లకు అమెజాన్ టెన్షన్స్ అలుముకున్నాయన్న మాటా వినిపిస్తోంది. మరోవైపు అమెరికాలో ఆరంభ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఓవర్సీస్ నుంచి బాహుబలి తరహలో 10 మిలియన్ డాలర్లను మించి వసూళ్లు తేవాల్సిన సన్నివేశం ఉంది. ఇప్పటికైతే పంపిణీ వర్గాల్లో అమెజాన్ టెన్షన్స్ అలుముకున్నాయట.