జబర్దస్త్ షో అంటే తలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఈ కార్యక్రమం చాలా మందికి లైఫ్ ఇచ్చింది. కామెడీ షో గా గుర్తింపు పొందింది. జబర్దస్త్ తో రోజా తన మలి విడత కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. తన నవ్వులతో కనువిందు చేసి జడ్జి స్థానానికే వన్నె తెచ్చిన విషయం తెలిసిందే. ఆమె లేని జబర్దస్త్ ను ఊహించుకోలేమని ఆర్టిస్టులు కూడా చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కావడంతో ఇక జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పనున్నారు.
2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో గా రూపుదిద్దుకోవడంలో రోజా పాత్ర కూడా ఉంది. నాగబాబు, రోజా జడ్జిలుగా జబర్దస్త్ కు కొత్త సొబగులు అద్దారు. ఆర్టిస్టులకు దిశా నిర్దేశం చేస్తూ నిత్యం వారిలో మార్పులు వచ్చేలా చేశారు దీంతో జబర్దస్త్ షో లో కామెడీ ఆర్టిస్టులకు సైతం ఉపాధి కల్పించారు. రానురాను షోను నిత్యం కొత్తదనంగా తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తున్నారు.
ఇక రోజా టీడీపీలో రాజకీయ రంగ ప్రవేశం చేసి వైసీపీలో చేరారు. టీడీపీలో కూడా మహిళా అధ్యక్షురాలిగా తానేంటో నిరూపించుకున్నారు. వైసీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు.వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన ఆమెకు మంత్రి పదవి దక్కడం సముచితమే. ఈ నేపథ్యంలో ఆమె జబర్దస్త్ షో లో పాల్గొని కంట తడి పెట్టారు జబర్దస్త్ ను వీడుతున్నందుకు బాధగా ఉందని వాపోయింది. తన అభిమానుల కోసం ఇన్నాళ్లు పనిచేశానని చెప్పుకొచ్చారు. దీంతో జబర్దస్త్ టీం మొత్తం ఆమెను ఓదార్చారు. మీరు దూరం కారని మా వెంటే ఎప్పుడు ఉంటారని చెప్పడం కొసమెరుపు.
రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రోజాకు మంత్రి పదవి ఊరించింది. మొదటి సారి గెలిచినప్పుడే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ రాలేదు. రెండో విడతలో ఇక ఆమె సహనాన్ని పరీక్షించొద్దని భావించిన జగన్ ఆమెకు మంత్రి పదవి అప్పగించి ఆమె సేవలు వినియోగించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మంచి టీంను తయారు చేసుకునే క్రమంతో సమర్థులైన వారికే పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో కూడా రోజా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమతపస్సు చిత్రం ద్వారా రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించారు. తరువాత సర్పయాగం సినిమాతో విజయం అందుకుని తానేంటి నిరూపించుకున్నారు. అందరు అగ్రహీరోలతో నటించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆమెకు ఎదురు లేకుండా పోయింది. చిత్తూరు నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం విశేషం.
జబర్దస్త్ లో మొదట నాగబాబుతో జడ్జి గా ఉన్న రోజాతో తరువాత మనో జడ్జిగా కలిశారు. కానీ నాగబాబు ఉన్నప్పుడే జబర్దస్త్ కు అందం ఉండేది. తరువాత కాలంలో ఆయన దూరమైనా రోజా మాత్రం కొనసాగించారు. తాను జబర్దస్త్ ను వీడలేనని పలుమార్లు చెప్పడం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం మంత్రి కావడంతో ఇక వీడక తప్పదు. ఎందుకంటే మంత్రి బాధ్యతలు నిర్వహించాలంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే జబర్దస్త్ షోకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది.
కానీ ఆమె జబర్దస్త్ షో మీద కంట నీరు పెడుతూ వీడ్కోలు చెప్పడంతో అందరు కన్నీరు మున్నీరు గా విలపించారు ఇన్నాళ్లు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని మనసారా ఏడ్చారు అందరి కళ్ల వెంట కన్నీళ్లే కనిపించాయి. మగ, ఆడ ఆర్టిస్టులే కాకుండా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కూడా కన్నీళ్లలో భాగస్వామ్యమైంది. రోజా ఇక నుంచి మీకు అందుబాటులో ఉండదని చెబుతూ ఆమె ఏడ్చేసింది.
Full View