ముంబై బ్యూటీ పూజా హెగ్దే ఉత్తరాది దక్షిణాది సినిమాలతో బిజీ నాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. `అల వైకుంఠపురములో` సక్సెస్ అనంతరం అమ్మడి స్థాయి మరో రేంజుకు చేరుకుంది. దీంతో పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తోంది. అందాల నయనతారకు సమానంగా 5 కోట్ల పారితోషికం అందుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేనా ఆన్ సెట్స్ కు వెళ్లిన తర్వాత పూజా హెగ్దే పై ఖర్చు కూడా నిర్మాతకు తడిపి మోపుడవుతోందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై రోజా భర్త.. తమిళ సినీ ఫెడరేషన్ ఛైర్మన్ సెల్వమణి పూజా పై సంచలన ఆరోపణలు చేసారు.
ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ్ లో విజయ్ సరసన `బీస్ట్` అనే క్రేజీ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ కు హాజరవుతున్న పూజా హెగ్దే తనతో పాటు ఏకంగా 12 మంది స్టాప్ ని అదనంగా తీసుకెళుతోందట. ఆ ఖర్చంతా నిర్మాత జేబులోంచే పెట్టాల్సివస్తోంది ట. ఎన్ని రోజులు షూటింగ్ అయితే అన్ని రోజులు ఆ గ్యాంగ్ మొత్తం ఆమె వెంటే ఉంటున్నారుట. ఇలాగైతే నిర్మాత జేబు గుల్లయిపోదా? అంటూ సెల్వమణి సీరియస్ అయ్యారు. నిర్మాతలతో అనవసరంగా డబ్బులు ఖర్చు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. పెద్ద సినిమా నటీనటులకు 55 శాతం బడ్జెట్ ని కేవలం రెమ్యునరేషన్లకు ఇస్తున్నారని.. అదే రోజుకు 16 గంటలు కష్టపడిన సాధారణ వర్కర్ కు మాత్రం బడ్జెట్ లో ఒక్క శాతం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్వమణి అన్నారు.
ఒకప్పుడు పూజా హెగ్దే ఇద్దరి స్టాఫ్ తో షూటింగ్ కి వచ్చేది. ఇప్పుడు ఏకంగా 12 మందిని తీసుకొస్తోందని.. ఇలాగైతే నిర్మాత సినిమా తీయగలడా? అని పూజా హెగ్దే తీరుపై మండిపడ్డారు. నిర్మాతలు కూడా అదే రీతిన హీరోయిన్లను వెనకేసుకొస్తున్నారు. మూడు సంవ్సతరాల క్రితం వర్కర్ల జీతాల విషయంలో అగ్రిమెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్లీ అగ్రిమెంట్ మాట లేకుండా పనులు చేయించుకుంటున్నారని అసహనాన్ని వ్యక్తం చేసారు. వీటన్నింటిపైనా సమూలంగా మార్పులు తీసొకొచ్చి ఒక చట్టం తీసుకురావాలన్నారు. అలాగే ఇటీవలే నటుడు శింబు పై కూడా సెల్వమణి మండిపడిన సంగతి తెలిసిందే. తమిళ నిర్మాతల మండలికి- ఫెప్సీకి మధ్య తలెత్తిన వివాదానికి శింబునే కారణమని ఆరోపించారు. హీరోలు హీరోయిన్లపై రుసరుసలతో సెల్వమణి ఇమేజ్ కూడా పెరుగుతోంది.