నారా రోహిత్ నటించిన అప్పట్లో ఒకడుండేవాడు.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్ తోపాటు శ్రీవిష్ణు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మల్టీ స్టారర్ రేంజ్ లో వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైపోయింది. ఇందుకు కారణం.. రియల్ లైఫ్ కేరక్టర్లను బేస్ చేసుకుని రాసుకున్న స్టోరీ ఇది అనే విషయం లీక్ అయిందట. ఈ మూవీలో నారా రోహిత్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా.. శ్రీ విష్ణు రైల్వే రాజు పాత్ర పోషిస్తున్నాడు. కొన్ని పరిస్థితుల కారణంగా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందట. అయితే.. ఈ రెండు పాత్రలు గ్యాంగ్ స్టర్ నయీం.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కథగా పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
వివాదాల సంగతి అలా ఉంచితే.. మూవీలో నారా రోహిత్-శ్రీ విష్ణుల మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. గతంలో అయ్యారే అనే చిత్రాన్ని తీసిన సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అది కూడా స్వామి నిత్యానంద పాత్ర చుట్టూ ఉన్న వివాదాల చుట్టూ రాసుకున్న మూవీనే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/