పొన్నియిన్ సెల్వ‌న్ లో ఎవ‌రి పాత్ర ఏంటీ?

Update: 2022-07-10 12:06 GMT
`బాహుబ‌లి` త‌రువాత ద‌క్షిణాది భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. ఈ మూవీ అందించిన స్ఫూర్తి, ధైర్యంతో తెలుగు, త‌మిళ‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్‌, పీరియాడిక్ ఫిల్మ్స్  తెర‌పైకొస్తున్నాయి. అయితే గ‌త కొంత కాలంగా `పొన్నియిన్ సెల్వ‌న్‌` ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తూ వ‌స్తున్న మ‌ణిర‌త్నం ఎట్ట‌కేల‌కు ఈ భారీ మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి మ‌ద్రాస్ టాకీస్  బ్యాన‌ర్ పై మ‌ణిర‌త్నం కూడా వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్నారు.  

విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, కార్తి, త్రిష‌, సారా అర్జున్‌, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, శోభిత ధూళిపాల‌, ప్ర‌కాష్ రాజ్‌, ప్ర‌భు, పార్తీబన్ త‌దిర‌తులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిర‌త్నం ఓ మ‌హాయ‌జ్ఞంలా భావించి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్ 30న ఐదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేప‌త్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించారు.

ఫేమ‌స్ రైట‌ర్ క‌ల్కీ కృష్ణ‌మూర్తి ర‌చించిన `పొన్నియిన్ సెల్వ‌న్‌` ఆధారంగా ఈ చారిత్ర‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో ఎవ‌రి పాత్ర ఏంటీ? ఏఏ పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు. వారి పాత్ర‌ల‌కున్న ప్రాముఖ్య‌త ఏంటీ? అన్నది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీలోని కీల‌క పాత్ర‌ల్లో పేరున్న న‌టీన‌టులు న‌టిస్తున్నారు.

పొన్నియిన్ సెల్వ‌న్‌, ఆదిత్య‌క‌రికాల‌న్‌, రాజ రాజ‌చోళ వెన‌కున్నచారిత్ర‌క క‌థ‌ని ఈ సినిమాలో చూపించారు. చోళుల మ‌ధ్య జ‌రిగిన అంత‌ర్యుద్ధం నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందింది. చోళుల యువ‌రాజు క‌రికాల‌న్ హ‌త్య‌ చేయ‌బ‌డ‌తాడు. అత‌న‌ని ఎవ‌రు చంపారు? ఎందుకు చంపారు. దీని వెన‌కున్న కథేంటి అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తించే అంశం.. ఈ క‌థ‌లో కీల‌క పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టించార‌న్న‌ది ఇప్పుడు చూద్దాం.  

జ‌యం ర‌వి పొన్నియిన్ సెల్వ‌న్ గా రాజ రాజ చోళుడిగా క‌నిపించ‌నున్నారు. అంతే కాకుండా కుంద‌వాయి, ఆదిత్య‌ క‌రికాల‌న్ కి సోద‌రుడు కూడా. ఆదిత్య‌ క‌రికాల‌న్ గా విక్ర‌మ్ క‌నిపించబోతున్నాడు. ఇక అంతఃపురంలో అన్ని కుట్ర‌లు, కుతంత్రాల వెన‌కున్న నందినిగా ఐశ్వ‌ర్యారాయ్ క‌నిపించ‌బోతోంది. అంతే కాకుండా ఆదిత్య క‌రికాలుడు మ‌న‌సుప‌డిన యువ‌రాణిగా నూ క‌నిపించ‌నుంది.  

కార్తి వందియ‌దేవ‌న్ గా వాన‌ర్ వంశానికి వార‌సుడిగా ఆదిత్య క‌రికాల‌న్ కు సామాంతుడిగా క‌నిపించ‌నున్నాడు. అత‌నికి ఓడీగా కుంద‌వాయి పాత్ర‌లో త్రిష న‌టించింది. ప్ర‌కాష్ రాజ్ సుంద‌ర చోళుడిగా న‌టించారు. అత‌ని కొడుకుగా ఆదిత్య క‌రికాల‌న్ గా చియాన్ విక్ర‌మ్ న‌టించారు. శోభిత వానాతిగా, ప్ర‌భు పెరియ వెల్లార్ గా , శ‌ర‌త్ కుమార్ పెరియ‌గా చోళ సామ్రాజ్యానికి కోశాధికారిగా క‌నిపించోతున్నారు. పార్ట్ 2లో మ‌రింత మంది క‌నిపించ‌నున్నారు. 
Tags:    

Similar News