విభిన్నమైన పాత్రలకు, కొత్త తరహా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తమిళ హీరో సూర్య. కెరీర్ ప్రారంభం నుంచి ప్రతీ సినిమాలోనూ వైవిధ్యంగా తన పాత్రలు వుండేలా చూసుకుంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. రీసెంట్ గా `సూరారైపోట్రు` సినిమాతో జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న సూర్య ఇదే మూవీతో ఐఫా వేదికపై వివిధ విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డుల్ని దక్కించుకుని వార్తల్లో నిలిచిన సూర్య తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్టోబర్ 9న బెంగళూరులో దక్షిణ భారత 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక అంగరంగ వైభంగా జరిగింది. ఇదే వేదికగా సూర్య హీరోగా నటించి నిర్మించిన `సూరారైపోట్రు` పలు విభాగాల్లో పోటీ పడి అనూహ్యంగా ఉత్తమ నటుడి పురస్కారం తో పాటు ఏడు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా స్టేజ్ పై తనదైన స్టైల్లో స్పందించిన సూర్య `విక్రమ్` మూవీలో తాను పోషించిన రోలెక్స్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ రోజు నేను ఏం చేసినా.. నటుడిగా ఈ స్థాయిలో వున్నానంటే దానికి కమల్ హాసన్ సార్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఫోన్ చేసి అవకాశం వుందని చెప్పినప్పుడు దాన్ని వదులుకోదలుచుకోలేదు. ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. భయపెట్టిన పనిని చేస్తేనే ఎదుగుదల అని నమ్ముతాను. అందుకే చివరి నిమిషంలో రోలెక్స్ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.
నిజానికి లోకేష్ కి ఈ పాత్ర చేయనని చెప్పాలనుకున్నా. కానీ చివరికి చేశా. అది కేవలం ఒక వ్యక్తి కోసే చేశాను. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్` అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. లోకేష్ కనగరాజ్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీలో సూర్య 5 నిమిషాల నిడివిగల రోలెక్స్ పాత్రలో నటించి టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ కింగ్ పిన్ గా నటించిన సూర్య పాత్ర సినిమాకే ప్రధాన హైలైట్ గా నిలిచింది. కమల్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో రూ. 400 కోట్ల మేర వసూళ్లని రాబట్టి కమల్ కు తిరుగులేని విజయాన్ని అందించింది. త్వరలో `విక్రమ్`కు సీక్వెల్ గా `ఖైదీ 2` సెట్స్ పైకి రాబోతున్న విషయం తెలిసిందే. కార్తి హీరోగా నటించనున్న ఈ మూవీలో సూర్య విలన్ రోలెక్స్ పాత్రలో నటిస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View Full View Full View