తెలుగులో '118' సినిమాని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్.. ఇప్పుడు ''WWW'' (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో అదిత్ అరుణ్ - శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై రవి ప్రసాద్ రాజు దట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో, అందరిలో చిన్నపాటి ధైర్యాన్ని తీసుకురావడానికి చిత్ర బృందం ఓ ర్యాప్ సాంగ్ తో వచ్చింది.
'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' సినిమా నుంచి ఈ 'లాక్ డౌన్' ర్యాప్ వీడియో సాంగ్ ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. 'హు వేర్ వై..' అంటూ సాగే ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె.కింగ్ ట్యూన్ అందించారు. ర్యాపర్ రోల్ రైడా లిరిక్స్ రాయడంతో పాటుగా తనదైన శైలిలో పాడాడు. కరోనా టైంలో ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అభినందించేలా.. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని తెలియజేసేలా ఈ పాట ఉంది. ఇందులో అదిత్ అరుణ్ - శివాని రాజశేఖర్ - వైవా హర్ష - దివ్య దృష్టి పెర్ఫార్మ్ చేశారు. దీనికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
''WWW'' (ఎవరు, ఎక్కడ, ఎందుకు) సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ మూవీ. దీనికి మిర్చి కిరణ్ డైలాగ్స్ రాస్తున్నారు. డైరెక్టర్ కేవీ గుహన్ స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శి - సత్యం రాజేష్ - రియాజ్ ఖాన్ ఇతర పాత్రలు పోషించారు.
Full View