అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్ ను ఏపీ అడవుల్లో నిర్వహించిన సుకుమార్ రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే జరుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్.. పూజా హెగ్డేలతో పాటు పెద్ద ఎత్తున డాన్సర్లు కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు అనే ప్రచారం జరిగింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
మొదటి షెడ్యూల్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కూడా యాక్షన్ సన్నివేశాలు.. చేజింగ్ సీన్స్ ను మాత్రమే చిత్రీకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మీడియాలో జరుగుతున్నట్లుగా రొమాంటిక్ పాట చిత్రీకరణ జరగడం లేదన్నారు. ఇంకా షూటింగ్ లో రష్మిక జాయిన్ అవ్వలేదని జనవరిలో ఆమె ప్రజెన్స్ లో షూటింగ జరుగబోతుంది అంటూ పుష్ప మేకర్స్ అనధికారికంగా పేర్కొన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా డీ గ్లామర్ గా కనిపించబోతున్నారు. అలాంటప్పుడు రొమాంటిక్ సాంగ్ సాధ్యమేనా అనేది ఆలోచించకుండా మీడియాలో కొందరు పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ బన్నీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.