ప్రస్తుతం జనాల దృష్టి సేంద్రీయ ఉత్పత్తులపై పడిందనే మాట ఒప్పుకోకతప్పదు. ఒకవైపు ఆరోగ్యానికి సహకరిస్తూ.. మరోవైపు అనారోగ్యాలకు దూరంగా ఉంచుతూ.. ఇంకోవైపు భారత సాంప్రదాయాలను కాపాడుకునే విధానం కావడంతో.. మన దేశంలో కూడా ఆర్గానిక్ ప్రొడక్టులకు డిమాండ్ బాగానే పెరుగుతోంది.
చాలామంది వీటిని ఉపయోగించడంలో బిజీగా ఉంటే.. మరికొందరు ఇందులో వ్యాపార అవకాశాలను గుర్తిస్తున్నారు. మార్జిన్లు కూడా బాగానే ఉంటున్నా.. ఈ సెగ్మెంట్ లో నిబద్ధత చాలా ముఖ్యమైన విషయం. స్టార్ డైరెక్టర్ స్థాయి నుంచి ఓ మెట్టు దిగిన శ్రీను వైట్ల.. ప్రస్తుతం రవితేజతో సినిమాకు సిద్ధమవుతుంటే.. అతని భార్య రూపా వైట్ల.. ఈ వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారంలోక అడుగు పెడుతున్నట్లు చెప్పింది. అంతేకాదు.. ముందుగా ఆ బ్రాండ్ ద్వారా ఆవు పాలను విక్రయిస్తారట.
వేదిక్ అనే బ్రాండ్ ద్వారా విక్రయం అయ్యే ప్రొడక్టులను రూపా వైట్ల మార్కెట్ చేయనుంది. అంతేకాదు.. మార్కెటింగ్ చేయడం కోసం ''ఇది ఓ విధానం కాదు.. విప్లవం'' అని వైట్ల మార్క్ పంచ్ డైలాగులను కూడా చెప్పడం విశేషం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన వ్యవసాయ.. డైరీ ఫార్మంగ్ లను ప్రోత్సహించడం ద్వారా మళ్లీ మన మూలాల వైపు ప్రయాణం చేయచ్చన్నది రూప వైట్ల మాట.