రూట్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ కావాలి. డబ్బులుంటే కాదు కంటెంట్ ఉంటేనే మంచి సినిమాలు వస్తాయి అని కార్పొరేట్ సంస్థలు విశ్వసిస్తున్నాయి కూడా ! అందుకే తెలుగులో హిట్ అయిన చిన్న చిత్రాలను సైతం తమ దగ్గర రీమేక్ చేయడానికి ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా బాలీవుడ్ స్థాయి ఎదిగిందో తగ్గిందో కానీ మొత్తానికి మన దక్షిణాది కథే వారికి ఓ పెద్ద దిక్కైంది.
మన కథలకు ముంబయి లో మంచి డిమాండ్ ఉంది. ఒకప్పటిలా కాదు ఇప్పుడు మన సినిమాలకు అక్కడి హీరోలు ఫిదా అవుతున్నారు. దీంతో సౌత్ నుంచి నార్త్ కు అనేక సినిమాల ప్రయాణం హాయిగానే సాగిపోనుంది. వీటిని రీమేక్ ల పేరిట వీలుంటే ఫ్రీమేక్ ల పేరిట చేసేందుకు ఇష్టపడుతున్నారు హిందీవాలాలు. గతం కన్నా మెరుగుయిన రీతిలో మన సినిమాలకు ఆదరణ రావడం, కథ రీత్యా మనోళ్లు చేస్తున్న ప్రయత్నాలు బాగుండడంతో బాలీవుడ్ పెద్దలంతా ఇక్కడి సినిమాల రూట్స్ ను పట్టుకునేందుకు, రైట్స్ ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే అందరికి బాగా క్రేజ్ ఉండేది..యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలను చేస్తున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు చప్పగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒకేలా చేస్తున్న కథలు కాకుండా కొత్త కథలను చేయాలని హిందీ హీరోలు ఆశ పడుతున్నారు.. అందుకే ఇప్పుడు అందరు సౌత్ సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ ఆకట్టుకుంటున్న సౌత్ కంటెంట్ పై ఇష్టం పెంచుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో భాగంగానే ఓ 25 సౌత్ సినిమాలను రీమేక్ చేసేస్తున్నారు.
ఇవి కాకుండా ఇంకో పది, పదిహేను సినిమాలను లైన్లో పెట్టారు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అందరూ కూడా రీమేక్ ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సౌత్ లో ముఖ్యంగా తమిళ్, తెలుగు, మలయాళ సినిమాల రీమేక్స్ తో బాలీవుడ్ కళ కళ లాడుతోంది.
ప్రజెంట్ అక్కడ సెట్స్ పై ఉన్న సినిమాలు మాక్సిమమ్ ఇక్కడి కథలతో రూపొందుతున్నవే. అంతెందుకు ఈ మధ్యే రిలీజ్ అయిన బచ్చన్ పాండే, జెర్సీ కూడా మంచి టాక్ ను అందుకున్నాయి. అక్షయ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ తరహా సినిమాలే కావాలని డిమాండ్ చేస్తున్నారు.
తమిళ్ థ్రిల్లర్ రాక్షసన్ కూడా అక్షయ్ లిస్ట్ లో ఉంది. మిషన్ సిండ్రిల్లా పేరుతో ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తారక్ ఊసరవెల్లిని కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు బాలీవుడ్ ఖిలాడీ.. తెలుగు, తమిళ్, మలయాళంలో భారీ హిట్ టాక్ ను అందుకున్న సినిమాలను బాలీవుడ్ హీరోలు రీమేక్ చేసే ఆలోచనలో బాలీవుడ్ జనాలు ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.తెలుగు లో వచ్చిన సినిమాలు దాదాపు హిందీ లో రీమేక్ అవుతున్నాయి.. మంచి సక్సెస్ రేటును అందుకుంటున్నాయి.