బ‌న్ని రోల్ రౌడీ అల్లుడు త‌ర‌హానా?

Update: 2020-01-06 06:16 GMT
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కంటెంట్ పై కాపీ అన్న‌ ముద్ర తొలి నుంచి ఉన్న‌దే. థీమ్ లైన్ తో పాటు.. స‌న్నివేశాల‌ను సైతం కాపీ కొడ‌తారంటూ ఆధారాలు చూపించి మ‌రీ క్రిటిక్స్ విమ‌ర్శిస్తుంటారు. పాత సినిమా క‌థ‌ల్ని ఎంచుకుని రీక్రీయేట్ చేయ‌డ‌మో.. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితోనో.. లేక‌ న‌వ‌ల‌ల‌ ఆధారంగానో విజువ‌ల్స్ క్రియేట్ చేస్తార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిస్తోన్న అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ర‌క‌ర‌కాల సినిమాల‌కు స్ఫూర్తి అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ఓవైపు ఎన్టీఆర్ న‌టించిన క్లాసిక్ మూవీ ఇంటిగుట్టుకు కాపీ అని లేదూ.. ఫ‌లానా మ‌ల‌యాళ సినిమాకి.. గుజ‌రాతీ హిట్ కి రీమేక్ అని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. ఇక ఈ సినిమాలో బ‌న్ని పాత్ర‌కు మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ని .. ఆహార్యాన్ని త్రివిక్ర‌ముడు డ్రాగ్ చేసాడ‌న‌డానికి తాజాగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. రౌడీ అల్లుడు సినిమా ఫార్ములాని లిప్ట్ చేసి అల వైకుంఠ‌ప‌ర‌ములో ఉప‌యోగించార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. రౌడీ అల్లుడు లో చిరంజీవి ధ‌రించిన రెడ్ కోట్ ను `అల వైకుంఠ‌పుర‌ములో` బ‌న్ని ఉప‌యోగించుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన రౌడీ అల్లుడి కి మోడ్ర‌న్ రీమేక్ ఇదీ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. బ‌న్నీ తొడుక్కున్న ఆ రెడ్ కోట్ ని చూస్తే నెటిజ‌నుల ఫీలింగ్ అలా ఉంద‌ట‌. మ‌రి కంటెంట్ ప‌రంగా రౌడీ అల్లుడు తో ఏమైనా మ్యాచింగ్ ఉందా అన్న‌దానికి రిలీజ్ త‌ర్వాతే క్లారిటీ వ‌స్తుంది. ఇప్ప‌టికే థ‌మ‌న్ సంగీతం అందించిన రాములో రాములా పాటని తెలంగాణ సింగర్ ఆల‌పించిన‌ యూట్యూబ్ పాపుల‌ర్ గీతం అంటూ దుమారం రేగుతోంది. దీనిపై థ‌మ‌న్ ఇంకా స్పందించ‌లేదు. ఇంత‌లో బ‌న్నీ రెడ్ కోట్ సీన్ కూడా కాపీనా అంటూ కొత్త చ‌ర్చ మొద‌లైంది. మ‌రి వీట‌న్నింటిపై గురూజీ త్రివిక్ర‌ముని రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News