దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ బోయ్స్ అనేది టైటిల్.
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ తో చేతులు కలిపి దిల్ రాజు- శిరీష్ నిర్మించారు. జనవరి 14న విడుదల సందర్భంగా ఆశిష్ మీడియాతో ముచ్చటిస్తూ తన హార్డ్ వర్క్ గురించి వెల్లడించారు.
నిజానికి తాను హీరో అవుతానని ఇంట్లో చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదని ఆశిష్ అన్నారు. ఆ తర్వాత 25 కేజీల బరువు తగ్గి సవాల్ అంటే ఏంటో చూపించానని దాంతో అందరూ నమ్మారని వెల్లడించారు.
రౌడీ బాయ్స్ ఆశిష్ తన స్ఫూర్తి ఎవరో కూడా వెల్లడించాడు. ఆశిష్ తన స్ఫూర్తి అల్లు అర్జున్ అని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. రౌడీ బాయ్స్ లోని డేట్ నైట్ పాటను అల్లు అర్జున్ విడుదల చేయగా వైరల్ అయిన సంగతి తెలిసినదే. ఇక బన్ని స్ఫూర్తితోనే తాను నటుడయ్యానని డ్యాన్సులు చేస్తున్నానని తెలిపారు. ఫ్యామిలీ ఈవెంట్లలో డ్యాన్సులు చేసే అలవాటు తనకు ఉందని తర్వాత నటశిక్షణ కోసం పలువురు గురువులను కలిసానని వెల్లడించారు. వైజాగ్ సత్యానంద్ .. భిక్షు వంటి నటశిక్షకుల వద్ద రాటుదేలానని తెలిపారు. ముంబైలో ఓ ఇనిస్టిట్యూట్ కి వెళ్లి కూడా శిక్షణ పొందానని.. అంతకుముందే న్యూయార్క్ ఫిలిం అకాడెమీలోనూ శిక్షణతో రాటు దేలానని వెల్లడించారు.
ఇక రౌడీ బోయ్స్ కాన్సెప్ట్ గురించి చెబుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు వర్సెస్ మెడికల్ విద్యార్థుల కాన్సెప్టుతో కాలేజ్ లవ్ వార్స్ నేపథ్యంలో ఈ మూవీ రక్తి కట్టిస్తుందని తెలిపారు. ఇందులో దేవీశ్రీ అందించిన 9పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని వెల్లడించారు. కాశీ అనే కొత్త దర్శకుడితో తన తదుపరి చిత్రం సెల్ఫిష్ చేస్తున్నానని ఆశిష్ తెలిపారు. అలాగే సుకుమార్ రచనతో ఈ చిత్రం చేస్తామని కూడా దిల్ రాజు ఈవెంట్లో వెల్లడించారు.