రౌడీ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. పూరి దర్శకుడు. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్- ఛార్మి- కరణ్ జోహార్ నిర్మాతలు. తెలుగు..హిందీ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరిలో పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయింది. హైదరాబాద్..ముంబై...గోవా సహా కొన్ని విదేశాల్లోనూ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. పూరి కూడా సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది.
`ఇస్మార్ట్ శంకర్`తో ఫామ్ లో కి వచ్చిన పూరి మళ్లీ ఫామ్ ని కోల్పోకూడదంటూ `లైగర్` తప్పక విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ పై ఎక్కువగానే వర్కౌట్ చేసి ఏరికోరి మరి విజయ్ ని హీరోగా ఎంచుకున్నారు. విజయ్ ఫాలోయింగ్ పూరి బ్రాండ్ తో `లైగర్` పై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. టీజర్.. ట్రైలర్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. వాటితో సినిమాకి మరింత బజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొంతకాలంగా టైసన్ తో కలిసి పని చేసే ఆలోచనపై విజయ్ రకరకాల హింట్స్ ఇచ్చారు. తాజాగా ఆ పాత్ర ఎలా ఉండబోతుందన్నది రివీల్ చేసారు.
టైసన్ తో కలిసి పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని..ఎగ్జైట్ మెంట్ ని ఇచ్చింది. మహాబలుడు నాపై విసిరిన పంచ్ లేవి నాకు డైరెక్టుగా కనెక్ట్ కాకూడదని ఆశపడుతున్నా. అతని పంచ్ లో పవర్ అలా ఉంటుంది మరి. అతనితో బాక్సింగ్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. టైసన్ ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అతనిలో ఇప్పుడు చాలా మార్పులు కనిపిస్తున్నాయ ని విజయ్ అభిప్రాయపడ్డాడు. మిగతా నటీనటులు కూడా సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసారు. ఎవరి పాత్రకు వారు పూర్తిగా న్యాయం చేసారు. అనన్య పాండే చక్కగా నటించింది. అనన్య నటను చూసి తప్పకుండా ఆమెని ప్రేమిస్తారని విజయ్ అన్నారు.
కెరీర్ గురించి కూడా విజయ్ ఓపెనయ్యారు. ఈ రంగంలో ఎవరికి వారు శ్రమిస్తున్నారు. ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కెరీర్ బెటర్ గా ఉండాలనే తపనతోనే పని చేస్తున్నారు. సినీపరిశ్రమ లో చాలా పోటీ ఉంటుంది. దానిని తట్టుకుని నిలదొక్కుకునేందుకే ఈ పోరాటం. చక్కని నటనతో సత్తా చాటితేనే ఇక్కడ ఉంటారు. లేదంటే ఒకానొక సమయంలో ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మేమంతా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. అనన్య కూడా లైగర్ లో తన పార్ట్ ని చక్కగా చేసింది. లైగర్ లో తన పెర్ఫామెన్స్ ని చూసేందుకు అంతా ఆసక్తిగా ఉన్నాం.. అని తెలిపారు.