హీరోలపై నేషనల్ క్రష్ మనసులో మాట!
ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక తన కోస్టార్స్ లో కొంత మంది గురించి ఇంతకాలం మనసులో దాచేసుకున్న మాటల్ని బటయట పెట్టింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసింది. చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయింది. కేవలం ట్యాలెంట్ తోనే అమ్మడు ఎదిగిందన్నది వాస్తవం. తనదైన చలాకీతనం..పాత్రల్లో పరకాయ ప్రవేశం ఇలా ప్రతీది రష్మికని అగ్ర స్థానంలో కూర్చబెట్టాయి. టాలీవుడ్ లో `ఛలో` తో లాంచ్ అయింది. అందులో నాగశౌర్యకి జోడీగా నటించింది.
అక్కడ నుంచి అమ్మడి కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక తన కోస్టార్స్ లో కొంత మంది గురించి ఇంతకాలం మనసులో దాచేసుకున్న మాటల్ని బటయట పెట్టింది. అవేంటో ఆమె మాటల్లోనే.. అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందంది. బన్నీతో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. అలాగే రణవీర్ సింగ్ కు..తనకు నాన్సెన్స్ అంటే అస్సలు నచ్చదంది.
కేవలం పాత్రల గురించి తప్ప ఇతర విషయాలు ఏవీ మాట్లాడుకోమని తెలిపింది. ఇద్దరు చాలా ప్రోఫెషనల్ గా ఉంటారంది. అలాగే విక్కీ కౌశల్ ని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించింది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని పేర్కొంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. అలాగే ఇతర హీరోల గురించి మాట్లాడుతూ, తాను నటించిన సినిమాల్లో హీరోలంతా ఎంతో కంపర్ట్ గా ఉంటుందని ,ఎలాంటి సన్నివేశాలైనా తేలిగ్గా చేయడంలో సహకరించారంది.
వాళ్లు అలా మద్దతివ్వడంతోనే హీరోయన్ గా మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాని తెలిపింది. అందరూ తనతో ఎంతో స్నేహభావంతో ఉంటారంది. వారెవరూ కూడా ఎదుట వారికి ఇబ్బంది కలిగించే స్వభావం కలవారు కాదంది. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `ఛావా` ఫిబ్రవరి 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే ఈ విషయాలన్నిపంచుకుంది.