కల్యాణ్ రామ్ హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో 'బింబిసార' సినిమా రూపొందింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా కల్యాణ్ రామ్ ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసి .. ఈ సినిమాను గురించి తింటూ మాట్లాడుకుందాం .. కనుక దీని పేరు 'తింటర్వ్యూ' అంటూ సుమ స్టార్ట్ చేసేసింది.
సుమ ప్రశ్నలకు కల్యాణ్ రామ్ స్పందిస్తూ .. "ముందుగా ఈ సినిమాకి పాటలను కూడా కీరవాణిగారితోనే చేయించాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఆయన 'ఆర్ ఆర్ ఆర్' పనులతో బిజీగా ఉన్నారు. అందువలన ఆయనను అడగలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మాత్రం చేయించాము.
ఆ విషయాన్ని మాట్లాడటానికి మేము ఆయన దగ్గరికి వెళితే, కీరవాణిగారి సినిమా చూస్తారనీ .. నచ్చితేనే చేస్తారని అక్కడివారు చెప్పారు. దాంతో ఆ సినిమా ఆయనకి నచ్చుతుందో లేదో .. చేస్తారో లేదో అని చాలా టెన్షన్ పడ్డాము.
కానీ ఆయన ఒప్పుకోవడం మా అదృష్టం. కీరవాణిగారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం వలన, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. ఈ సినిమాకి ఆయన ప్రాణం పోశారు. ప్రస్తుతానికి నేను దీనిని పాన్ తెలుగు సినిమానే అని పిలుస్తాను.
తెలుగులో ఈ సినిమాకి మేము ఆశించిన రెస్పాన్స్ వస్తే, ఈ నెల 18వ తేదీన ఇతర భాషల్లోను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాము. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ పాయింట్ ను టచ్ చేశాము. అలా టైమ్ ట్రావెల్ చేసే ఛాన్స్ నాకు వస్తే, మా తాతగారి కాలానికి వెళ్లి, ఆయన పాత సినిమా షూటింగులను దగ్గర నుంచి చూడాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక కీరవాణిగారు మాట్లాడుతూ .. "ఈ సినిమా నివురు గప్పిన నిప్పులాంటిది అని చెప్పుకోవచ్చు. కల్యాణ్ రామ్ 'అతనొక్కడే' సినిమా నేను చేయవలసింది .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కానీ ఇప్పుడు నేను 'అతనొక్కడే' చేసినట్టే. అదెలాగంటే ఈ సినిమాలో హీరోగా .. విలన్ గా చేసింది కల్యాణ్ రామ్ ఒక్కడే .. అందువలన 'అతనొక్కడే' చేసిన అనుభూతి కలుగుతోంది. నా కెరియర్లో నేను సంగీతాన్ని అందించిన సినిమాలకి మాత్రమే నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. వేరేవారు సంగీతాన్ని అందించిన సినిమాకి నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇవ్వడం ఈ సినిమా విషయంలోనే జరిగింది. ఈ సినిమాకి ఆ ప్రత్యేకత కూడా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
Full View