సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ సుపరిచితుడు. ఒకానొక దశలో ప్రముఖ సంగీతదర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. తర్వాతి కాలంలో మ్యూజిక్ డైరెక్షన్‌కు దూరంగా వెళ్లిపోవటం తెలిసిందే. వరుస హిట్లు ఇచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలకు సంగీత దర్శకుడిగా దూరం కావటం ఏమిటన్నప్రశ్నకు చాలామంది నోట హీరో నాగార్జున కారణమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఆ ప్రచారంలో నిజం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు ఆర్పీ.
తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు ఆర్పీ. అందులో తానను సంగీత దర్శకుడిగా ఎందుకు పని చేయటం లేదన్న విషయంపై స్పష్టతతో పాటు.. ఈ ఇష్యూకు నాగార్జునకు లింకు ఎందుకు లేదన్న విషయాన్ని చెప్పారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ చిత్రానికి పని చేసే అవకాశాన్ని మిస్ అయిన విషయాన్ని చెప్పారు.
నాగార్జున హీరోగా నటించిన నేనున్నాను సినిమాకు మొదట తననే సంగీత దర్శకుడిగా తీసుకున్నారని ఆర్పీ చెప్పారు. ఆ తర్వాత కొన్ని ట్యూన్స్ కూడా తాను ఇచ్చినట్లుగా చెప్పిన ఆర్పీ.. "ఒక పెద్ద వ్యక్తి (పేరు చెప్పలేను) నా దగ్గరకు వచ్చారు. నిన్ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవటం లేదన్నారు. ఎందుకని అడిగా. నీ వల్ల సినిమాకు బిజినెస్ జరగటం లేదన్నారు. అప్పుడే ఇక సంగీత దర్శకుడిగా పని చేయకూడదని నిర్ణయించుకున్నా. నిర్మాత సేఫ్ గా ఉంటే ఎంతోమంది బతుకుతారు. అలాంటి నిర్మాతకు నా వల్ల డబ్బులు రావన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా దూరం ఉండటం మంచిది కదా. అందుకే దూరంగా ఉన్నా" అని చెప్పారు.
ఇదంతా నేనున్నాను సినిమా అప్పుడు జరగటం.. ఆ సినిమాకు హీరో నాగార్జున కావటంతో అందరూ ఆయనే కారణమని అనుకున్నారు.కానీ.. ఆయనకు.. నేను మ్యూజిక్ డైరెక్షన్ నుంచి తప్పుకోవటానికి అస్సలు సంబంధం లేదని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్ మూవీకి మ్యూజిక్ ఇవ్వాల్సి ఉందని.. అయితే.. అప్పట్లో యూఎస్ ట్రిప్ ఉందని చెప్పానని.. అయితే మేనేజర్ల మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఆ అవకాశం మిస్ అయ్యిందని చెప్పారు. దీంతో.. వేరే వారిని ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/