ఫింగర్ చూపిస్తున్న కంపోజర్!!

Update: 2016-08-19 04:21 GMT

మ్యూజిక్ డైరెక్టర్ గా.. సింగర్ గా మాత్రమే కాకుండా.. యాక్టర్ గా ఆర్పీ పట్నాయక్ కి మంచి మార్కులే పడతాయి. తనే లీడ్ రోల్ లో సినిమాలు కూడా చేసేస్తుంటాడు ఈ కంపోజర్. అలాగని ఈయన చేసిన.. తీసిన సినిమాలు భారీ హిట్స్ ఏమీ అయిపోలేదు కానీ.. ప్రత్యేకతతో అంతో ఇంతో గుర్తింపు మాత్రం తెచ్చుకున్నాయి.

త్వరలో 'మనలో ఒకడు' అంటూ తనే లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు ఆర్బీ పట్నాయక్. ఇప్పుడు ఫస్ట్ లుక్ టైపులో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చూపుడు వేలు మాత్రం పైకి చూపిస్తున్న ఓ అరచెయ్యి మాత్రమే కనిపిస్తుంది. 'మనలో ఒకడు' ఆ ఒక్క వేలునే ఎందుకు చూపిస్తున్నాడో.. అటెటో చూపించడం ఏంటో అనే డౌట్స్ వస్తున్నా.. ప్రస్తుతం అయితే ఇచ్చినంతవరకూ చూడ్డమే. కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం ఆర్పీ పట్నాయక్ కార్డ్ తో ఈ మూవీ రిలీజ్ కానుండగా.. నువ్వు నేను ఫేమ్ అనిత హీరోయన్ గా నటిస్తోంది. ఆర్పీ డైరెక్షన్ అనేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందమైన మనసులో అంటూ తన డైరెక్షన్ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆర్పీ.. బ్రోకర్ మూవీతో మంచి సినిమా తీశాడని అనిపించుకున్నాడు. కాన్సెప్ట్ సూపర్బ్ గా ఉన్నా.. ప్రొడక్షన్ వాల్యూస్.. డైరెక్టర్(ఆర్పీ పట్నాయక్) మిస్టేక్స్ కారణంగా ఈ సినిమా ఫెయిల్ అయింది. దీన్ని శంకర్ లాంటి దర్శకుడు తీసుంటే.. బ్లాక్ బస్టర్ స్థాయిలోఉండేది ఆ తర్వాత కూడా ఫ్రెండ్స్ బుక్.. తులసిదళం.. వ్యూహ అంటూ డైరెక్షన్ ని కంటిన్యూ చేశాడు. మధ్యలో 'అమీ' అంటూ ఓ హాలీవుడ్ మూవీకి కూడా దర్శకత్వం వహించేశాడు. ఇప్పుడు మనలో ఒకడు పరిస్థితి ఏంటో అప్పుడే చెప్పలేం.
Tags:    

Similar News