టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కమెడియన్ సునీల్ తో పాటు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా మంచి స్నేహితుడన్న సంగతి తెలిసిందే. వీళ్లు ముగ్గురూ హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఒకే గదిలో ఉండి సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. తర్వాత ముగ్గురూ ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్నారు. ఐతే త్రివిక్రమ్ తన సినిమాల్లో సునీల్ కు చాలా అవకాశాలిచ్చాడు కానీ.. ఆర్పీ పట్నాయక్ తో ఒక్కసారి కూడా కలిసి పని చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విషయమై ఆర్పీని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆసక్తికర రీతిలో స్పందించాడు.
‘‘నేను.. త్రివిక్రమ్ రూం మేట్స్ గా ఉన్నపుడు నేను ‘ఆనందం’ పేరుతో ఒక ప్రైవేట్ ఆల్బం చేశాను. త్రివిక్రమే దానికి సాహిత్యం అందించాడు. అప్పట్లో అది పర్వాలేదనిపించింది. తర్వాత త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా మారాడు. అది స్రవంతి మూవీస్ బేనర్ లో చేసిన సినిమా. వాళ్లకు కోటి గారు అఫీషియల్ మ్యూజిక్ డైరెక్టర్. నేను త్రివిక్రమ్ ను అడిగితే అప్పుడే అడిగి ఉండాలి. ఐతే తన సినిమాకు నా సంగీతం బాగుంటుందా లేదా అన్నది త్రివిక్రమ్ నిర్ణయం. నేను అడగకూడదు. నేనైతే 99 శాతం న్యాయం జరుగుతుందని.. మరో సంగీత దర్శకుడైతే 100 శాతం న్యాయం జరుగుతుందని ఆయన అనుకున్నప్పుడు వేరే సంగీత దర్శకుడితోనే వెళ్లడం సబబు. నాకైతే ఎవరినీ అవకాశాల కోసం అడిగే అలవాటు లేదు’’ అని ఆర్పీ అన్నాడు.