#RRR డీల్ 300కోట్ల ఆఫ‌ర్ కాద‌నుకున్నారా?

Update: 2021-03-26 09:00 GMT
బాహుబ‌లి ఫ్రాంఛైజీ సినిమాల త‌ర్వాత #RRR తో రాజ‌మౌళి- దాన‌య్య‌ బృందం మ‌రోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు గ‌ట్టి ప్లాన్ తో ఉన్నార‌న్న  గుస‌గుస‌లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఆర్.ఆర్‌.ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగా హైప్ క్రియేట్ చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కుముందు ఐదు భాష‌ల థియేట్రిక‌ల్ రిలీజ్ హ‌క్కుల రూపంలో 350 కోట్ల డీల్ పూర్తి చేశార‌ని మ‌రో 6భాష‌ల రిలీజ్ హ‌క్కులకు అద‌న‌పు మొత్తం ముట్ట‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. తొలి బిగ్ డీల్ తోనే బ‌డ్జెట్ అంతా రిక‌వ‌రీ అయ్యింది. దానికి తోడు ఆడియో.. శాటిలైట్.. డిజిట‌ల్ అద‌నంగా లాభం తేనున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. ఆర్.ఆర్.ఆర్ డిజిట‌ల్- శాటిలైట్ డీల్ కూడా మాట్లాడుతున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే స్టార్ మా-అమెజాన్ ప్రైమ్ వాళ్లు రూ .291 కోట్లు  (శాటిలైట్ రూ .130 కోట్లు... డిజిటల్ రూ .160కోట్లు క‌లుపుకుని) ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేక‌ర్స్ ఇంకా ఆచితూచి అడుగులేస్తున్నారని.. ఇంకా పెద్ద మొత్తం ఆశిస్తున్నార‌ని తెలిసింది.

పోటీ బ‌రిలో నెట్ ఫ్లిక్స్ .. జెమిని లాంటి బ‌డా కార్పొరెట్ సంస్థ‌లు భారీగా ఆఫ‌ర్ చేస్తాయ‌ని వెయిట్ చేస్తున్నార‌ట‌. అయితే మునుప‌టి ఆఫ‌ర్ చెప్పుకోదగిన‌దే. డీల్ క్లోజ్ చేయ‌కుండా ఆల‌సించిన ఆశాభంగం త‌ప్ప‌ద‌న్న హెచ్చ‌రిక‌లు జారీ అవుతున్నాయి. మ‌రి దాన‌య్య వ‌ర్గాలు దీనిపై స‌త్వ‌రం ఎలాంటి ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తారు? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News