రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీ-స్టారర్ RRR టీజర్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు వాయిస్ తో భీమ్ టీజర్ వచ్చినప్పటి నుండి అనేక వివాదాలను అశాంతిని సృష్టిస్తోంది. ఇందులో వివాదాస్పద అంశం ఏదీ అంటే.. సాంప్రదాయకంగా ముస్లిమ్ టోపీపై పుర్రె చిత్రం ఉన్నది ధరించిన ఎన్టీఆర్ లుక్ అభ్యంతరకరం అంటూ వివాదం రాజుకుంది.
ఇప్పటికే ఉట్నూర్ (ఆదిలాబాద్ జిల్లా)లో పలువురు హిందువులు .. ఆదివాసీ సంఘం సభ్యులు ఆ స్పెషల్ షాట్ (వేషధారణ)పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ లుక్ ను వెంటనే తొలగించాలని రాజమౌళిని కోరారు. ఇప్పుడు కొమరం భీమ్ మనవడు సోన్ రావు కూడా నిరసనలలో చేరారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు లేదా చిత్రీకరణ సమయంలో రాజమౌళి కానీ దానయ్య కానీ.. కొమరం భీమ్ కుటుంబ సభ్యులతో సంప్రదించలేదని ఆయన అన్నారు. టీజర్ నుండి ఆ షాట్ ను తొలగించాలని ఆయన రాజమౌళిని డిమాండ్ చేశారు. మరోవైపు రాజమౌలి లేదా RRR బృందం ఇంతవరకూ ఈ వివాదంపై స్పందించలేదు.
ఎట్టి పరిస్థితిలో 2021 సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయాలన్న పంతంతో రాజమౌళి పూర్తిగా చిత్రీకరణపైనే దృష్టి సారించారు. ఓవైపు టాకీ పూర్తి చేస్తూనే నిర్మాణానంతర పనుల్లో వేగవంతం చేయాలన్న పట్టుదల కనబరుస్తున్నారని సమాచారం. సీతారామరాజుగా చరణ్ లుక్.. కొమరం భీమ్ పాత్రధారిగా ఎన్టీఆర్ లుక్ ఇప్పటికే అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.