మేకింగ్ వీడియో: ఎన్టీఆర్ - పులి ఫైట్ కోసం జక్కన్న ఎంత కష్టపడ్డాడో చూడండి!

Update: 2022-08-27 11:38 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫిక్షన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''RRR''. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది.

జక్కన్న సినిమాలో బలమైన కథ కథనాలతో పాటుగా ఎమోషన్స్ - యాక్షన్ సీన్స్ - విజువల్ ఎఫెక్స్ట్ కి పెద్ద పీట వేస్తారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలోనూ VFX వర్క్స్  అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ - క్లైమాక్స్ సన్నివేశాలలో వీఎఫ్ఎక్స్ ఆడియన్స్ ని అబ్బురపరిచాయి.

ఇప్పటికే RRR సినిమాలోని కొన్ని సీన్స్ కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ఎలా జరిగిందో మేకింగ్ వీడియోల ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. లేటెస్టుగా VFX సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ యొక్క మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

RRR లో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్.. ఇంట్రో సీన్ లో ఒక పులి తో పోరాటం చేస్తాడు. ఇది సినిమాలోని బెస్ట్ సీన్స్ లో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఈ సన్నివేశాన్ని క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని మేకింగ్ వీడియో తెలియజేస్తోంది.

స్టోరీ బోర్డ్ లో స్కెచ్లు గీయడం నుండి VFX ద్వారా పులిని సృష్టించడం వరకు ఎలా చేసారనేది ఇందులో చూడొచ్చు. పులి కదలికలు ఎలా ఉండాలనేది రాజమౌళి చేసి చూపించడాన్ని మనం గమనించవచ్చు. జక్కన్న మార్గదర్శకాల ప్రకారం, VFX డిపార్ట్మెంట్ అటువంటి అద్భుతమైన సీక్వెన్స్ ని క్రియేట్ చేశారు.

రాజమౌళి విజన్ ను మరియు దీని కోసం చిత్ర బృందం పడిన శ్రమను అభినందించాలి. లండన్ కు ఎంపీసీ కంపనీ ఈ సీన్ కి వీఎఫ్ఎక్స్ వర్క్స్ జోడించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటించగా.. అలియా భట్ - అజయ్ దేవగన్ - సముద్రఖని - ఒలివియా మోరిస్ - శ్రియా శరణ్ - రాహుల్ రామకృష్ణ ఇతరులు ఇతర పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. RRR కు గ్లోబల్ ప్రశంసలు దక్కిన తర్వాత ఈ సినిమా వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని.. పలు విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Full View
Tags:    

Similar News