దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'RRR'. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 8 న విడుదల అంటూ డేట్ కూడా వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో అది సాధ్యమేనా అనే అనుమానాలు నెలకొన్నాయి.
రాజమౌళి టీమ్ మాత్రం ఎలాగైనా ప్రకటించిన డేట్ కే ఈ సినిమాను విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరూ తమ తమ ఇళ్లలోనే ఉన్నారు. అయితే ఈ సమయంలో 'RRR' లో చరణ్.. ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అటు చరణ్.. ఇటు తారక్ ఇళ్లలో మినీ థియేటర్స్ ఉన్నాయని.. అందుకే డబ్బింగ్ చెప్పించడం వీలవుతుందనే ఉద్దేశంతో ఇద్దరికీ రెండు హై క్వాలిటీ సౌండ్ రికార్డింగ్ మైక్స్ ను పంపారట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరు హీరోలతో ఈ డబ్బింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారట. తెలుగు తమిళ వెర్షన్ల డబ్బింగ్ ఈ రకంగా పూర్తిచేయాలని ప్లాన్ చేయడం తో తమిళ వెర్షన్ డైలాగ్ రైటర్ మదన్ కార్కీ కూడా ఈ పనుల్లో పాలుపంచుకుంటున్నారట.
అయితే ఇలా డబ్బింగ్ పూర్తి చేసినప్పటికీ రియల్ గా డబ్బింగ్ థియేటర్లో రికార్డ్ చేసిన క్వాలిటీ వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. జక్కన్న క్వాలిటీ విషయంలో రాజీపడే వ్యక్తి కాదు కాబట్టి ప్రేక్షకులు దిగులు పడాల్సిన పని లేదు. ఒకవేళ ఈ పధ్ధతి వర్క్ అవుట్ కాకపోతే మళ్ళీ డబ్బింగ్ వర్క్స్ థియేటర్ లోనే చేయించడం ఖాయం. ఏదేమైనా లాక్ డౌన్ లో కూడా పని వాయిదా పడకుండా ఏదో ఒకరకంగా వినియోగించుకోవాలని చూస్తున్న రాజమౌళిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ శెలవులను 'RRR' ప్రమోషన్ కోసం సమర్థంగా వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అందరూ ప్రమోషన్లు ఆపిన సమయంలో ఒక్కసారిగా టైటిల్ మోషన్ పోస్టర్.. భీమ్ ఫర్ రామరాజు టీజర్ విడుదల చేసి లాక్ డౌన్ ను భలే వాడుకోవచ్చని అందరికీ దారి చూపించారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ వర్క్స్ ఇతర ఫిలింమేకర్లకు దారి చూపుతాయేమో వేచి చూడాలి,