RRR స‌త్తా ఏంటో ఆస్కార్ క‌మిటీకి తెలుస్తోందా?

Update: 2022-09-13 15:06 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్ `RRR`. వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీని వీక్షించిన విదేశీ ప్రేక్ష‌కుల‌తో పాటు హాలీవుడ్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ ఈ మూవీపై, ఇందులో న‌టించిన హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురించారు.

సినిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌మోట్ చేస్తూ ప‌ది మంది ఈ మూవీని త‌ప్ప‌కుండా చూడాలంటూ ప్ర‌చారం చేయ‌డం మొత‌లు పెట్టారు. ఇదిలా వుంటే RRR మూవీని విదేశీ ప్రేక్ష‌కుల్లో ఓ వ‌ర్గం ఆస్కార్ కోసం ప్ర‌మోట్ చేస్తుండ‌టం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస్కార్ క‌మిటీకి తెలిసేలా ప్ర‌చారం చేస్తూ ట్వీట్ ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆస్కార్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ఆస్కార్ అవార్డుల‌పై స్పందించింది.

మ‌రో ఆరు నెల‌ల్లో 95వ అస్కార్ అకాడ‌మీ అవార్డులు వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఇది ప్రిడిక్ష‌న్ టైమ్‌...వ‌చ్చే ఏడాది అకాడ‌మీ అవార్డుల వేడుక‌లో ఉత్త‌మ చిత్రంగా ఏ సినిమా అవార్డుని గెలుస్తుంద‌ని మీరు అనుకుంటున్నారు?` అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ కి ధీటుగా నెటిజ‌న్ లు RRR మూవీ గురించి ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఉత్త‌మ అంత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయ్యే ఛాన్స్ RRR మూవీకి మించి మ‌రో సినిమాకు లేదంటూ నెట్టింట సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఈ నేప‌థ్యంలో RRR మూవీ స‌త్తాని నెటిజ‌న్ లు, అభిమానులు ఆస్కార్ అకాడ‌మీకి తెలిసేలా చేస్తుండ‌టం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.గ‌త కొన్ని రోజులుగా RRR మూవీకి ఆస్కార్ ఖ‌చ్చితంగా ల‌భిస్తుంద‌ని దేశ వ్యాప్తంగా వున్న ఫిల్మ్ సెల‌బ్రిటీలు, విమ‌ర్శ‌కులు వెల్ల‌డిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మ‌రో ఆరు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న 95వ ఆస్కార్ అకాడ‌మీ ఆవార్డుల్లో మ‌న దేశం త‌రుపున `RRR` ఎంపిక‌వుతుందా? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని నెల‌ల త‌రువాతే దీనిపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News