యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా 'అశోకవనంలో అర్జునకల్యాణం' మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఐదు ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.
ఇందులో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ మాసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ 'దాస్ కా ధమ్కీ'. 'ఫలక్ నుమాదాస్' మూవీతో హీరోగానే కాకుండా దర్శకుడి, రచయితగా సత్తాచాటుకున్న విశ్వక్ సేన్ ఈ మూవీతో తనలో మంచి టెక్నీషియన్ కూడా వున్నాడని నిరూపించాడు.
మలయాళ మూవీ 'అంగనమలై డైరీస్' ఆధారంగా 'ఫలక్ నుమా దాస్'ని రీమేక్ చేసి దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నవిశ్వక్ సేన్ అదే స్ఫూర్తితో 'దాస్ కీ ధమ్కీ' తనే డైరెక్ట్ చేస్తున్నాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ ల పై ఈ మూవీని కరాటే రాజు నిర్మిస్తున్నారు. 'దాస్ కా ధమ్కీ'కి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. ఇదొక రోమ్ కామ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సినిమా అని మేకర్స్ అంటున్నారు. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా సమపాళ్లలో వుంటుందట. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 95 శాతం పూర్తయిందట. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం టీమ్ బల్గేరియా వెళుతోంది. RRR, హరి హర వీరమల్లు వంటి భారీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ టాడొర్ లజరోవ్, జుజీ యాక్షన్ ఘట్టాలని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం వీరి నేతృత్వంలో సారథీ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో పలు యాక్షన్ ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. పుకెట్ లో నెల రోజుల షెడ్యూల్ ని, స్పెయిన్ లో ఓ స్మాల్ షూట్ ని పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. అక్కడి నుంచే ప్రమోషన్స్ ని హోరెత్తిస్తారట. ఇక 'బింబిసార' లో ఫైట్ సీక్వెన్స్ కి సారథ్యం వహించిన రామకృష్ణ మాస్టర్ కూడా ఈ మూవీ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశారట.
అంతే కాకుండా వెంకట్ అనే మాస్టర్ స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎపిసోడ్ ను పర్యవేక్షించారట. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ, లియోన్ జేమ్స్ సంగీతం, అన్వర్ అలీ ఎడిటింగ్ అందిస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ప్రథాన పాత్రల్లో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.