అమెరికాలో `RRR`..ఆ సినిమాకి ద‌రిదాపుల్లో లేదే!

Update: 2022-04-10 11:05 GMT
మార్చి 25న రిలీజ్ అయిన  పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వార్ స్టిల్ బాక్సాఫీస్ వ‌ద్ద కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎనిమిది రోజుల్లోనే 750 కోట్ల వ‌సూళ్ల‌తో `బాహుబ‌లి ది బిగినింగ్` వ‌సూళ్ల‌ను బ్రేక్ చేసినా `ఆర్ ఆర్ ఆర్`...అటుపై ఏరియాల వైజ్ గానూ `బాహుబ‌లి` బిగినింగ్ వ‌సూళ్ల‌ను తుడిచిపెట్టేసింది. ఇటీవ‌లే 1000 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో `బాహుబ‌లి` ది క‌నుక్లూజ్ త‌ర్వాత రెండ‌వ స్థానంలో నిల‌బ‌డింది ఆర్ ఆర్ ఆర్.

తెలుగు సినిమాల ప‌రంగా `ఆర్ ఆర్ ఆర్` అందుకున్న అరుదైన‌ రికార్డు ఇది. ఇండియా టాప్ -5 వ‌సూళ్ల చిత్రాల్లో స్థానం ద‌క్కించుకుంది. ఇండియా వైడ్ మూడ‌వ  స్థానంలో ఉంది ఆర్ ఆర్ ఆర్. `దంగ‌ల్` 2024 కోట్ల‌తో మొద‌టి స్థానంలో  ఉండ‌గా...`బాహుబ‌లి ది క‌నుక్లూజ‌న్` 1810 కోట్ల వ‌సూళ్ల‌తో రెండ‌వ స్థానంలో ఉండ‌గా..1000  కోట్ల‌ను అధిగ‌మించి `ఆర్ ఆర్ ఆర్`  మూడ‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది.

స్టిల్ `ఆర్ ఆర్ ఆర్` వార్ ఇంకా థియేట‌ర్ల వ‌ద్ద కొన‌సాగుతుంది. కానీ `బాహుబ‌లి క‌నుక్లూజ‌న్` బీట్ చేసే అవ‌కాశ‌మైతే లేదు. అది జ‌రిగితే అద్భుతమే. ఇక `ఆర్ ఆర్ ఆర్` అమెరికాలోనూ రికార్డు వ‌సూళ్ల‌ను సాధించింది. అక్క‌డ ఏకంగా 13.3 మిలియ‌న్ వ‌సూళ్ల‌తో రెండ‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది. 13.5 మిలియ‌న్లు అంటే ఇండియా క‌రెన్సీ ప్ర‌కారం 100 కోట్లు.

నార్త్ అమెరికాలో  పెద్ద సంఖ్య‌లో   రిలీజ్ అవ్వ‌డంతోనే ఈ ఫీట్ సాధించ‌గ‌ల్గింది. అయితే `బాహుబ‌లి -2` వ‌సూళ్లు మాత్రం ఎక్క‌డా చెక్కు చెర‌ద‌లేదు.  `బాహుబ‌లి -2` అమెరికాలో  23 మిలియ‌న్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ వ‌సూళ్ల‌తో పోల్చుకుంటే `ఆర్ ఆర్ ఆర్` జ‌స్ట్ అనే చెప్పాలి.  కానీ `బాహుబ‌లి -2` త‌ర్వాత అమెరికాలో భారీ వ‌సూళ్లు సాధించిన రెండ‌వ చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్` రికార్డు సృష్టించ‌డం విశేషం.

ఇక ఏపీలో `ఆర్ ఆర్ ఆర్` థియేటర్లు ఇంకా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ గా న‌డుస్తున్నాయి. త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌ల‌తో ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ `ఆర్ ఆర్ ఆర్` వీక్షించేందుకు క్యూ క‌డుతున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌లైన `గ‌ని` కూడా పోటీలో లేకుండా పోయింది . దీంతో ఈ వారం కూడా `ఆర్ ఆర్ ఆర్` దే హ‌వా అయింది. మ‌రో ప‌ది రోజుల పాటు `ఆర్ ఆర్ ఆర్` థియేట‌ర్లు ఆక్యుపెన్నీ  బాగుంటుంది. దీంతో వ‌సూళ్ల ప‌రంగా మార్పులు చోటు చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News