నిర్మాత బలవంతం వల్లనే..!
అయితే ప్రచార కార్యక్రమాల్లో అతడు చెప్పిన ఒక మాట సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
వాసన్ బాలా బాలీవుడ్ లో ప్రత్యేకత ఉన్న దర్శకుడు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, మోనికా ఓ మై డార్లింగ్ , మర్ద్ కో దర్ద్ నహీ హోతా వంటి చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు ప్రతిభావంతమైన దర్శకుడు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన జిగ్రాను అక్టోబర్ 11న థియేటర్లలోకి తెస్తున్నాడు. అయితే ప్రచార కార్యక్రమాల్లో అతడు చెప్పిన ఒక మాట సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి 'జిగ్రా' చిత్రం కోసం తన మైండ్‌లో వేరొక కథానాయిక ఉందని, కానీ కరణ్ జోహార్ వల్ల ఆలియాను తీసుకోవాల్సి వచ్చిందని స్పష్ఠంగా చెప్పినట్టు బాలీవుడ్ మీడియాలు కథనాలు వేసాయి. ఆలియా ఈ చిత్రంలో తన సోదరుడిని రక్షించే డ్యాషింగ్ యాక్షన్ క్వీన్ పాత్రలో నటించింది. తన సోదరుడిగా వేదాంగ్ రైనా నటించారు. జిగ్రా ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభ దశలో కరణ్ జోహార్ తన స్క్రిప్ట్‌ను అలియా భట్‌తో అడగకుండానే షేర్ చేసారని ఇటీవల వెల్లడించారు. ప్రధాన పాత్ర కోసం తన మనసులో వేరే నటి ఉందని, అయితే అలియా భట్‌ని తీసుకోవాలని కరణ్ ఒప్పించాడని కూడా చెప్పాడు!
ఆలియాపై కరణ్ జోహార్ వాత్సల్యం చాలా ప్రత్యేకమైనది. వారిది గురు శిష్యుల అనుబంధం. ఇంకా చెప్పాలంటే తండ్రి కూతురు అంటే అతిశయోక్తి కాదు. అతడు `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రంతో ఆలియాను వెండితెరకు పరిచయం చేసాడు. పలు చిత్రాలకు ఇద్దరూ కలిసి పని చేసారు. ఆలియా ప్రెజెంట్‌ని, భవిష్యత్ ని కూడా అతడు ప్రభావితం చేయగలడు. తనకు నచ్చిన స్క్రిప్టులో ఆలియాను చేర్చగలడు. వాసన్ బాలన్ తో సినిమా విషయంలోను అదే జరిగింది.