కుమార్తె సక్సెస్ తో గర్వంగా సూర్య-జ్యోతికలు!
సినిమాలో సీన్ బాగా రావాలంటే ప్రతిభావంతులైన నటీనటులుంటే సరిపోదు.
కోలీవుడ్ జోడీ సూర్య-జ్యోతికల ముద్దుల కుమార్తె దియా మరోసారి తల్లిదండ్రులు గర్వపడేలా నిలిచింది. తాజాగా ఓ డాక్యుమెంటరీ రూపొందించి తన ట్యాలెంట్ బయట పెట్టింది. ఇండస్ట్రీలో మహిళా టెక్నీషిన్ల ఇబ్బందులపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. సినిమాలో సీన్ బాగా రావాలంటే ప్రతిభావంతులైన నటీనటులుంటే సరిపోదు. ఆసీన్ షూట్ చేసే ప్రదేశంలో మంచి లైటింగ్ ఉండాలి.
సీన్స్ కు తగ్గట్టు ఎఫెక్ట్స్ ఉండాలి. అయితే ఇవన్నీ సరిగ్గా ఉండేట్లు చూసుకునే మహిళా టెక్నీషియన్లకు సరైన గుర్తింపు రావడం లేదు. చాలా మంది వారిని చిన్న చూపు చూస్తున్నారు. వారి ఇబ్బందులను ప్రస్తావిస్తూ దియా `లీడింగ్ లైట్: దఇ అన్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ది సీన్స్` అనే డాక్యుమెంటరీ రూపొందించింది. దియా యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులో ఉంది. కుమార్తెలో ఈ ట్యాలెంట్ చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు.
జ్యోతిక ఇన్ స్టా వేదికగా కుమార్తెపై ప్రశంసలు కురిపించింది. దియా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లేడీ టెక్నీషియన్లు ఎదుర్కోంటున్న వివక్షను డాక్యుమెంటరీ రూపంలో అర్దవంతంగా చూపించావు. ఎంతో కాలంగా ఉన్న సమస్యను వెలుగులోకి తెచ్చినందుకు థాంక్యూ` అని రాసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగానూ దియా ఉత్తమ స్క్రీన్ రైటర్ గా త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది.
దీంతో జ్యోతికతో పాటు తండ్రి సూర్య కూడా గర్వంగా ఫీలయ్యారు. పిల్లలు కూడా తల్లిదండ్రులాగే ఎంతో తెలివైన వారని తెలుస్తోంది. సూర్య-జ్యోతిక నటీనటులుగా కొనసాగుతూనే నిర్మాణ రంగంలోనూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వాళ్ల సంస్థ నుంచి రిలీజ్ అయిన `సత్యం సుందరం` మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి.