ఆ లిస్ట్ లో నాల్గవ స్థానం లో RRR..!

Update: 2022-12-16 04:58 GMT
ఇంటర్నేషనల్ లెవల్లో RRR అద్భుతాలు చేస్తుండగా గూగుల్ ట్రెండ్ లో మాత్రం ఆ సినిమా నాల్గవ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. ప్రతి ఏడాది గూగుల్ ట్రెండ్స్ లో ఉన్న సినిమాల లిస్ట్ ఇయర్ ఎండింగ్ లో ప్రకటిస్తుంది గూగుల్. ఈ క్రమంలో ఈ ఏడాది గూగుల్ ట్రెండ్స్ లో నెంబర్ 1 స్థానంలో బ్రహ్మాస్త్ర సెకండ్ ప్లేస్ లో కె.జి.ఎఫ్ 2 నిలిచాయి. 3వ స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఉండగా నాల్గవ స్థానంలో ఆర్.ఆర్.ఆర్ ఉంది. ఈ ఇయర్ IMDb ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ గూగుల్ ట్రెండ్ లో మాత్రం ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది.

రణబీర్ కపూర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా నేషనల్ వైడ్ గా భారీగా రిలీజైంది. ఈ ఏడాది బాలీవుడ్ కి ఊపిరి ఇచ్చిన సినిమా అదే అని చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా గురించి గూగుల్ లో బాగా ట్రెండ్ చేశారు. ఇక గూగుల్ ట్రెండింగ్ లో టాప్ 2 ప్లేస్ లో ఉన్న సినిమా కె.జి.ఎఫ్ 2. చాప్టర్ 1 సూపర్ సెన్సేషన్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ సినిమాని నిలబెట్టాడు. అందుకే కె.జి.ఎఫ్ 2 గురించి కూడా గూగుల్ లో ఒక రేంజ్ లో జరిగింది. కె.జి.ఎఫ్ 2 సినిమా రిలీజైన 3 వారాల పాటు గూగుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇక గూగుల్ ట్రెండ్స్ టాప్ 10లో థర్డ్ ప్లేస్ లో ది కశ్మీర్ ఫైల్స్ నిలిచింది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించి కూడా ఒక రేంజ్ లో డిస్కషన్స్ జరిగాయి. ఇక ఈ లిస్ట్ లో 4వ స్థానంలో ఆర్.ఆర్.ఆర్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి కూడా భారీగా చర్చ జరిగింది.

గూగుల్ ట్రెండ్స్ లో ట్రిపుల్ ఆర్ నాల్గవ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార ఈ లిస్ట్ లో ఐదవ స్థానంలో నిలవగా.. ఆరవ స్థానంలో పుష్ప ఉంది. గూగుల్ ట్రెండింగ్ టాప్ 10 లిస్ట్ లో కమల్ హాసన్ విక్రం 7వ స్థానంలో ఉంది. ఇక ఎనిమిదవ స్థానంలో లాల్ సింగ్ చడ్డా కూడా ఉంది.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా సినిమా గూగుల్ ట్రెండింగ్ లో ఎనిమిదవ స్థానం దక్కించుకుంది. ఇక ఈ లిస్ట్ లో 9వ స్థానంలో దృశ్యం 2 చివరి స్థానంలో థార్ నిలిచింది. ఒక సినిమా గురించి ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారు. సినిమా గురించి గూగుల్ లో ఏ రేంజ్ లో సెర్చ్ చేశారు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని గూగుల్ ట్రెండ్స్ టాప్ 10 లిస్ట్ రెడీ చెస్తారు. ఈ ఏడాది గూగుల్ ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాలు ప్రేక్షకులను అలరించిన సినిమాలు కూడా అవే అని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News