దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కి, ట్రెమండస్ థాంట్స్ కి ట్రిపుల్ ఆర్ లో హీరోలని ప్రజెంట్ చేసిన విధానం, వారిపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ లకి ఫారిన్ జనం పిచ్చెక్కిపోతున్నారు. తెలుగు సినిమా మన సినిమాలతో పోటీపడుతుండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇందులో భాగంగానే ట్రిపుల్ ఆర్ ని మళ్లీ మళ్లీ చూస్తూ పిచ్చెక్కిపోతున్నారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ 'ట్రిపుల్ ఆర్'. దాదాపు మూడున్నరేళ్లుగా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులు ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావడంతో ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు.
రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డుల్ని తిరగరాస్తూ సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లని రాబడుతూ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో మూడవ సినిమాగా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇండియాలోనే కాకుండా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గానూ తెలుగు ప్రేక్షకులతో పాటు ఫారినర్స్ కూడా ఈ మూవీపై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.
ఓవర్సీస్ లో ఈ మూవీపై క్రేజ్ మామూలుగా లేదు. ఉత్తర అమెరికాలో ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఇప్పటికే 440 కె డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. తెలుగు వారితో పాటు ఫారినర్స్ ఈ మూవీని యమ క్రేజీగా చూసేస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తూ మిగతా వారు కూడా చూడాలని సినిమాలోని సీన్ లని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండటం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
ఓ లేడీ అభిమాని సినిమాలో ఎన్టీఆర్- పులి ఫైట్ .. రైల్ యాక్సిడెంట్ కారణంగా బ్రిడ్జి కూలిపోతున్న సమయంలో హీరోలిద్దరూ కలిసి చేసిన యాక్షన్ సీక్వెన్స్, దీని తరువాత ఇద్దరను హీరోలపై చిత్రీకరించిన దోస్తీ సాంగ్, క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ గాల్లో ఎగురుతూ బాణాలు సంధించే సీన్స్ ని వివరిస్తూ చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక కాలిఫోర్నియాకు చెందిన జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ట్రిపుల్ ఆర్ పై చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. ఐపీ మ్యాన్ తరువాత నేను చూసిన ఏషియన్ ఫిల్హ్ ఇదే నని, బాలీవుడ్ సినిమాలు మిరంత మారాల్సిన అవసరం వుందని కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరో ఫారినర్ మరింత ఆసక్తిగా ట్వీట్ చేశారు. ట్రిపుల్ ఆర్ చాలా ఎంటర్ టైనింగ్ గా వుందని, మరో సారి చూడబోతున్నానని, మరోసారి మీరు ఎందుకు చూడకూడదు అని ట్వీట్ చేశారు.
ఇక మరో ఫారినర్ ఇప్పడే నాలుగవ సారి నా కజిన్స్ తో కలిసి సినిమా చూసి వచ్చానని, ఈ మూవీ ఎక్స్ పీరియన్స్ ని మాటల్లో చెప్పలేనని, మీరంతా కూడా ఈ మూవీని మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటూ తను చూసిన సినిమా టికెట్ లని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇందులో విశేషం ఏంటంటే తెలుగు రాని ఫారినర్ తెలుగు వెర్షన్ చూసి ట్వీట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.